పాఠశాలల టైమింగ్స్ మార్పు - చలి ఎఫెక్ట్, కొత్త వేళలు ఇలా..!!

పేరెంట్స్ కు బిగ్ అలర్ట్. చలిగాలుల విజృంభణ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలుల తీవ్రతకు తోడు పొగమంచు కూడా తోడవ్వడంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. మరో మూడు రోజులు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు. చలి.. మంచు ప్రభావం కారణంగా పాఠశాలల టైమింగ్స్ లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

తెలంగాణలో చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. మరి కొద్ది రోజులు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. దీంతో, పాఠశాలల కు వచ్చే విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో పాఠశాలల టైమింగ్స్‌ మారాయి. జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాల సమయాలను సవరించి, ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగేలా నిర్ణయించారు.

school-timings-have-been-revised-due-to-severe-cold-waves-and-fog-details-here

ఈ మార్పులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. అన్ని మండల విద్యా శాఖ అధికారులకు, ప్రభుత్వ, ఎల్బీ, కేఏజీబీవీ, మోడల్ హై స్కూళ్లు, అలాగే ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్గదర్శకాలను పాటించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, పాఠశాల సమయాల మార్పుల అమలును విద్యాశాఖ పర్యవేక్షించనుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇదే విధంగా చలి తీవ్రత ఎక్కవ ఉన్న మిగిలిన ప్రాంతాల్లో వెసులు బాటు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌ టెంపరే చర్స్‌ నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజులు భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+