Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్-ఏకంగా 34 రైళ్లు..! ఈ తేదీల్లో..

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు అదనంగా ఇవాళ మరో 34 అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవన్నీ హైదరాబాద్ నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు నడవనున్నాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోని వివిధ తేదీల్లో ఈ అదనపు ప్రత్యేక రైళ్లు ప్రయాణం సాగిస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే తెలిపింది.

దక్షిణ మధ్య రైల్వే ఇవాళ శబరిమలకు ప్రకటించిన 34 అదనపు ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నుంచి జనవరి 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలురే ఈ ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు సాయంత్రం 4.10కి కొట్టాయం చేరుకుంటాయి. అలాగే కొట్టాయం నుంచి జనవరి 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.10కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు రాత్రి 11.45కి సికింద్రాబాద్ కు చేరుకుంటాయి.

scr announced 34 additional special trains for Sabarimala pilgrims- here are details

అలాగే జనవరి 3, 10, 17, 24 తేదీల్లో మౌలాలీ నుంచి మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు సాయంత్రం 6.45కి కొట్టాయం చేరుకుంటాయి. తిరిగి కొట్టాయంలో జనవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 9.45కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు మధ్యాహ్నం 1.30కి సికింద్రాబాద్ చేరుకుంటాయి. కాచిగూడలో జనవరి 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 12.30కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు సాయంత్రం 6.50కి కొట్టాయం చేరుకుంటాయి.

అలాగే కొట్టాయంలో జనవరి 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.50కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు కాచిగూడ చేరుకుంటాయి. అలాగే జనవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 6.45కి మౌలాలీలో బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు రాత్రి 10.30కి కొల్లం చేరుకుంటాయి. జనవరి 6, 13, 20, 27 తేదీల్లో అర్ధరాత్రి 2.30కి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మౌలాలీ చేరుకుంటాయి.

హైదరాబాద్-కొట్టాయం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, సీరం, సూలేహళ్లి, యాద్గీర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గూటి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, జోల కట్టాడి, లింగంపల్లి, సాలార్ కట్టాడిలో ఆగుతాయి. ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా మరియు ఎర్నాకులం టౌన్ స్టేషన్‌లు రెండు దిశలలో వెళ్లే రైళ్లు ఆగుతాయి.

మౌలాలీ-కొట్టాయం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్‌లలో ఆగుతాయి. ఎర్నాకులం, ఎట్టుమనూర్ స్టేషన్లలో రెండు దిశల్లో వెళ్లే రైళ్లు అగుతాయి.

కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, కోయంబత్తూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్, తిరుప్పూర్‌లో ఆగుతాయి. అలువా, ఎర్నాకులం , ఎట్టుమనూరు స్టేషన్లలో రెండు వైపులా వెళ్లే రైళ్లు ఆగుతాయి.

మౌలాలీ-కొల్లం-మౌలాలీ ప్రత్యేక రైళ్లు భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్‌పూర్‌లో ఆగుతాయి. పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్‌ల్లో ఇరువైపులా వెళ్లే రైళ్లు ఆగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+