వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రి తాడ్వాయి హాస్టల్లో సీతక్క బస.. విద్యార్థులతో కలిసి ములుగు ఎమ్మెల్యే ఏం చేశారంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వ వసతి గృహాలపై దృష్టి పెట్టారు. ఇటీవల కొత్తగూడా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురైన నేపథ్యంలో ఆ హాస్టల్ ను సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించిన సీతక్క, అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్కూల్ లోని కిచెన్ ను పరిశీలించిన సీతక్క స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని స్కూల్ సిబ్బందికి తెలిపి, మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ సీతక్క హెచ్చరించారు.

తాడ్వాయి ప్రభుత్వ బాలికల హాస్టల్ ను రాత్రి సందర్శించిన సీతక్క

ఇక ఆపై నిన్న రాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క తాడ్వాయి ప్రభుత్వ హాస్టల్ కు వెళ్లి విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనుకోకుండా రాత్రి తమ హాస్టల్ కి వచ్చిన ఎమ్మెల్యే సీతక్కకు విద్యార్థులు సంతోషంగా స్వాగతించారు. అందరూ సీతక్కతో ఆప్యాయంగా గడిపారు. విద్యార్థులకు ఎమ్మెల్యే సీతక్క అనేక విషయాలను చెప్పారు. ఏ విధంగా చదువుకోవాలి? ఎంత ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి? చదువు తోటి ఉపయోగం ఏంటి? శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? వంటి అనేక విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. హాస్టల్ జీవితం ఎంతో అద్భుతమైనదని వారికి తెలియజేశారు.

విద్యార్థులతో కలిసి రాత్రి నిద్రించిన ఎమ్మెల్యే సీతక్క

చిన్నతనంలో తాను కూడా హాస్టల్లో ఉండి చదువుకునే దాన్ని అని పేర్కొన్న సీతక్క, హాస్టల్లో మంచి సౌకర్యాలు, స్నేహితులు ఉంటే హాస్టల్ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక వారి ఆటపాటలను వీక్షించి ఎమ్మెల్యే సీతక్క వారితో ఉత్సాహంగా, సంతోషంగా గడిపారు. రాత్రి విద్యార్థుల మధ్య విద్యార్థులతో కలిసి హాస్టల్ లోనే బస చేశారు ఎమ్మెల్యే సీతక్క. నేలమీద విద్యార్థుల మధ్యలో పడుకొని నిద్రించిన ఎమ్మెల్యే సీతక్క ఉదయం నిద్ర లేచిన తర్వాత పిల్లలతో పాటు వ్యాయామం చేశారు.

బాలికలతో ఆటలు ఆడిన సీతక్క.. హాస్టల్ వసతులపైన ఆరా.. సిబ్బందికి సూచనలు


బాలికలతో కలిసి యోగా చేశారు. వాలీబాల్, కోకో ఆటలు ఆడిన సీతక్క వారితో గడిపిన మధురమైన క్షణాలతో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు విద్యార్థులలో హాస్టల్ పట్ల ఆసక్తిని, చదువు పట్ల శ్రద్ద ను కలిగించడంతో పాటు, హాస్టల్లో వసతుల కల్పన, హాస్టల్ లో ఉన్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక హాస్టల్ ను నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే సీతక్క, చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఉన్నానని ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

English summary
Mulugu MLA Seethakka stayed at Tadwai girls' hostel at night. Mulugu MLA had fun playing games with the students. She told them to understand the importance of education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X