నిజంపై ప్రశంసల జల్లు: కెసిఆర్‌కు షబ్బీర్ అలీ బాసట

హైదరాబాద్‌: నిజాం ప్రభువును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రశంసించడాన్ని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు షబ్బీర్ అలీ సమర్థించారు. అన్ని విషయాల్లోనూ కెసిఆర్‌పై ధ్వజమెత్తుతూ వస్తున్న షబ్బీర్ అలీ నిజాం విషయంలో ఆయనకు మద్దతు పలకడం ఆసక్తిగా మారింది. ఆస్పత్రుల నిర్మాణాల విషయంలో నిజాం రాజు గొప్పరాజు అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినమాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు షబ్బీర్‌ అలి వ్యాఖ్యానించారు.

తెలంగాణాలో ఆరోగ్యంకోసం నిజాం గారు చేసిన కృషి చాలా ఉంది అని ఆయన శ్లాఘించారు. ఉస్మానియా ఆస్పత్రి, గాంధి ఆస్పత్రి,, క్యాన్సర్‌ ఆస్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రి,, పాగల్‌ఖానా, చెస్ట్‌ ఆస్పత్రి ... ఇలా మనిషికి ఎన్ని భాగాలు ఉన్నయో అన్ని ఆస్పత్రులు నిజాం కట్టించారని ఆయన గుర్తు చేశారు. నిజాం రాజు కట్టించినన్ని దవాఖానాలు మరే రాజూ కట్టించలేదని ఆయన అన్నారు.

Shabbir Ali supports KCR on Nizama issue

నిజాం చేసిన మిగిలిన విషయాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడను గానీ కెసిఆర్ నిన్నటి మాటలను మాత్రం అంగీకరిస్తానని ఆయన చెప్పారు. దేశంలో 300 మంది పైగా రాజులు ఉన్నా పేదల ఆరోగ్యం కోసం ఎవ్వరూ ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆరునెలల పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ పాలనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కెసిఆర్ ఏడు నెలల పాలనలో వారానికి ఒక వాగ్దానం చేశారని, అయితే ఒక్క వాగ్గానాన్ని కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను అప్పట్లో ఇస్తాంబుల్ చేస్తానన్న కెసిఆర్ ఇప్పుడు డల్లాస్ చేస్తానని అంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు. హైదరాబాపద్ అభివృద్ధిపై కెసిఆర్ చేసిన 20కి పైగా వాగ్దానాలల్లో ఒక్కటి కూడా అమలు చేయడం ప్రారంభం కాలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+