శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను పేల్చేస్తామంటూ.. బెదిరింపు కాల్..!
నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ స్థాయిలో కారు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఎయిర్ పోర్ట్ పేల్చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆఫీస్ కు మెయిల్ రావడం సంచలనంగా మారింది. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ లోని పలు షాపింగ్ మాల్స్, ఆలయాలు, బస్ స్టాపుల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.
A bomb threat was received through IndiGo’s grievance portal, mentioning five airports — Delhi, Mumbai, Chennai, Thiruvananthapuram, and Hyderabad. The threat has been declared a hoax, but security measures have been tightened: Airport Official pic.twitter.com/7mgzKFVFib
— Press Trust of India (@PTI_News) November 12, 2025
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మాత్రమే కాదు.. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే విమానాన్ని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఆ సమయంలో విమానంలో 176 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది.

దేశవ్యాప్తంగా మొత్తం ఐదు ప్రధాన విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం.. ఐదు ప్రధాన విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఇక నవంబర్ 10 సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. మరికొంత మంది క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications