Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆమెకు 55.. అతనికి 22! పెళ్లికి సిద్ధమయ్యారు.. పోలీసులు నచ్చజెప్పినా.

గోల్కొండ ధాన్‌కోటకు చెందిన అయేషాబేగం (55) భర్త నాలుగు నెలల క్రితమే మరణించాడు.

హైదరాబాద్: ఆమెకు 55. అతనికి 22. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెళ్లి వరకు వచ్చింది. ఇదేదో పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఘటన కాదు..సాక్షాత్తూ మన హైదరాబాద్‌లోనే జరుగుతోంది, ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరుకుంది.

ఈ చిక్కుముడి ఎలా విప్పాలో తెలియక తలపట్టుకోవడం పోలీసుల వంతయింది. గోల్కొండ ధాన్‌కోటకు చెందిన అయేషాబేగం (55) భర్త నాలుగు నెలల క్రితమే మరణించాడు. తర్వాత ఆమెకు, అదే ప్రాంతానికి చెందిన, ఓ కొరియర్‌ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ ముదస్సిర్‌ అలియాస్‌ అర్షద్‌ (22)ల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

She is 55 and He is 22.. Both are ready for marriage

Recommended Video

    Facebook Hurt Your Marriage,It Is Better Not To Follow Your Partner

    వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కాస్తా సహజీవనం వరకు వచ్చింది. ఇరు కుటుంబాల సభ్యుల నుంచి బెదిరింపులు రావడంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆదివారం గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు.

    ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఫయాజ్‌ వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికే కట్టుబడటంతో పోలీసులు సైతం తలపట్టుకున్నారు. చేసేది లేక వారం రోజుల తర్వాత మళ్లీ స్టేషన్‌కు రావాలని సూచించి పంపారు. వారం రోజుల తర్వాత మతపెద్దల సమక్షంలో వీరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఐ తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+