కేసీఆర్ కు షాక్; ప్రగతి భవన్ కు ఎన్నికల సంఘం నోటీసులు!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు అన్ని పార్టీల నాయకులు. అయితే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తుంది.

Shock for KCR; Election Commission notices to Pragati Bhavan!!

ప్రగతి భవన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదని.. ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం అని, అయినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తున్నదని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలలో భాగంగా అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనేక తర్జన భర్జనల మధ్య నోటీసులు జారీ చేశారు.గురువారం సాయంత్రం సీఈవో వికాస్ రాజుతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదుపై ఎవరికి నోటీసులు ఇవ్వాలి అన్న దానిపైన వారు చర్చించారు.

దీంతో చివరకు ప్రగతి భవన్ నిర్వహణ అధికారులైన వారికి నోటీసులు పంపించారు ఎన్నికల సంఘం అధికారులు. మరి ఈ నోటీసులకు ప్రగతిభవన్ ఏవిధంగా రెస్పాండ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రజా ప్రతినిధుల అధికారాలు ఈ సమయంలో సుప్తావస్థలో ఉంటాయి. ముఖ్యమంత్రి అధికారాలు కూడా అంతే.. ఈ నేపధ్యంలోనే అధికారిక నివాసంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఫిర్యాదుతో ప్రగతి భవన్ కు నోటీసులు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+