రేవంత్ రెడ్డికి షాక్.. త్వరలో తెలంగాణాకు కొత్త సీఎం?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో తాజాగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు బిజెపి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. త్వరలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వనుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త ముఖ్యమంత్రి రానున్నాడని, అది కూడా డిసెంబర్ లోపే వస్తాడని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు
గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు కానీ ఆయనను కలవడానికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేరళ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కేవలం దూరం నుంచి చూసి వచ్చారని వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు.

తెలంగాణాకు కొత్త సీఎం అప్పుడే
ఆయన ఏకపక్ష ధోరణిని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తాను ఏది పడితే అది మాట్లాడానని చెప్పిన ఆయన తాను ఎంతో రీసెర్చ్ చేస్తేనే మాట్లాడతానని వెల్లడించారు. 2025 సంవత్సరంలో జూన్ నెల నుంచి డిసెంబర్ లోపు తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తాడని ఆయన గట్టిగా చెప్పారు.
రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదులు
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతోందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నేతల నుండి అధిష్టానానికి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో చేరాయి అన్నారు. సీఎం భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని రేవంత్ మంత్రివర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారని ఇక ఈ విషయాన్ని అధిష్టానం కూడా నమ్ముతుందని ఆయన తెలిపారు.
రేవంత్ అవినీతి, సెల్ఫ్ అజెండాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా
మూసి ప్రాజెక్టు వ్యయాన్ని రేవంత్ రెడ్డి మూడు రెట్లు పెంచిన తర్వాత అందులో రేవంత్ రెడ్డి అవినీతి ఉందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్టుగా ఆయన పేర్కొన్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి కొత్తవారికి కట్టబెట్టనున్నట్టు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి సెల్ఫ్ అజెండాల పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరా తీసిందన్నారు.
రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ హాట్ టాపిక్
రంగంలోకి దిగిన సోనియా గాంధీ దీనిపైన డీకే శివకుమార్ ద్వారా ఆరా తీసినట్టు ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇస్తుందని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలోను ప్రజలలోను ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications