జానీ మాస్టర్ కు షాక్.. పోలీసుల కస్టడీకి అనుమతి.. ఎన్ని రోజులంటే!

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ ను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి కోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. జానీ మాస్టర్ ను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన 21సంవత్సరాల యువతీని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే .

జానీ మాస్టర్ నాలుగు రోజులు కస్టడీకి
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ను విచారణ జరిపేందుకు తమకు ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో నేడు నార్సింగి పోలీసులు కోరినట్టు ఐదురోజులు కాకుండా నాలుగు రోజులపాటు జానీ మాస్టర్ ను కస్టడీకి ఇచ్చేందుకు అనుమతినిచ్చింది.

Shock to Jani Master Permission granted by court to police custody for four days to johnny master

న్యాయవాది సమక్షంలోనే విచారణ
అయితే ఎటువంటి పరిస్థితులలోనూ జానీ మాస్టర్ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ ను దీంతో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరపనున్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి తనను జానీ మాస్టర్ గత ఐదు సంవత్సరాలుగా బెదిరించి అత్యాచారం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది.

జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు
విషయం బయటకు చెబితే తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, సెప్టెంబర్ 15వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జానీ మాస్టర్ పైన జీరో ఎఫైర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ఆ తర్వాత కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ కేసు పైన యువతి వాంగ్మూలం నమోదు చేశారు నార్సింగి పోలీసులు.

పోక్సో చట్టం క్రింద జానీ మాస్టర్ పై కేసు నమోదు, జానీ మాస్టర్ అరెస్ట్
యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నట్టు చెప్పడంతో ఎఫ్ఐఆర్లో పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.తన పైన తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న యువతి చేసిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులు ఆయన గోవాలో ఉన్నారని గుర్తించి పక్క ఆధారాలతో గోవాకు వెళ్లి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు.

జానీ మాస్టర్ కేసులో కోర్టు తాజా ఆదేశాలు
ఆపై అక్కడ స్థానిక కోర్టులో జానీ మాస్టర్ ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు తీసుకువచ్చి ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఇక ఈ కేసులో జానీ మాస్టర్ ను విచారించాలనుకున్న పోలీసులు కోర్టులో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు తాజాగా నాలుగు రోజులు పాటు కస్టడీకి ఇవ్వడానికి అంగీకరించి తీర్పు వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+