నిజామాబాద్ రైతులకు షాక్ .. మోడీపై పోటీలో ఒకే ఒక్క పసుపు రైతు .. 24 మంది నామినేషన్లు తిరస్కరణ

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు .ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని టార్గెట్ చేసి నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ వారణాసిలో నామినేషన్లు వేసిన రైతులకు ఈసీ షాక్ ఇచ్చింది. 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించింది.

వారణాసిలో నామినేషన్లు వేసిన రైతులకు ఎదురుదెబ్బ .. 24 మంది నామినేషన్లు తిరస్కరణ

వారణాసిలో నామినేషన్లు వేసిన రైతులకు ఎదురుదెబ్బ .. 24 మంది నామినేషన్లు తిరస్కరణ

వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. నామినేషన్ల స్క్రూటినీలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. రైతులు నామినేషన్లు వెయ్యటానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టించిన అధికారులు నామినేషన్లను కావాలనే తిరస్కరించారని వారు ఆరోపిస్తున్నారు.

వారణాసి అధికారులపై సిఈసీకి ఫిర్యాదు చెయ్యనున్న రైతులు

వారణాసి అధికారులపై సిఈసీకి ఫిర్యాదు చెయ్యనున్న రైతులు

దీనిపై తెలంగాణ పసుపు రైతుల సంఘం నేతలు...మే 3న ఢిల్లీకి వెళ్లి వారణాసి అధికారులపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వారణాసిలో మోడీతో పాటు 119 మంది నామినేషన్లు వేయగా వివిధ కారణాలతో 89 మంది నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ స్థానం బరిలో ప్రధాని మోడీ సహా 30మంది మాత్రమే ఉన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు , పంటలకు గిట్టుబాటు ధర కల్పించటమే లక్ష్యం

పసుపు బోర్డు ఏర్పాటు , పంటలకు గిట్టుబాటు ధర కల్పించటమే లక్ష్యం

పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుండి 178 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేసి తమ డిమాండ్ ను దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు.

మోడీపై పోటీలో ఒకేఒక్క పసుపు రైతు

మోడీపై పోటీలో ఒకేఒక్క పసుపు రైతు

ఇక వారణాసిలో సైతం పోటీ చేసి తమ డిమాండ్ సాధించుకోవాలని భావించారు. అయితే రైతులను నామినేషన్లు వెయ్యకుండా అధికారులు అవాంతరాలు కల్పించారని రైతులు ఆందోళన సైతం చేశారు. మొత్తం 25 మంది రైతులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వీరిలో 24 మంది నామినేషన్లు తిరస్కరించారు ఎన్నికల అధికారులు. కేవలం ఒకే ఒక్క రైతు మోడీపై ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+