పవన్ కళ్యాణ్ కు షాక్: జనసేనకు ఆ టికెట్లు ఇవ్వొద్దు; బీజేపీ కార్యకర్తల ఆందోళన!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, జనసేనలు కలిసి పొత్తుతో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే గతంలో 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ బిజెపి అగ్రనేతలు అమిత్ షా తో మాట్లాడిన తర్వాత నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది. బిజెపి ఇచ్చిన స్థానాలతో సరి పెట్టుకోవాలని భావిస్తున్నప్పటికీ ప్రాధాన్యత లేని స్థానాలను తమకు ఇవ్వద్దని జనసేన కోరుతుంది.
ఈ క్రమంలో జనసేన తో పొత్తు, సీట్ల కేటాయింపు బిజెపి అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బిజెపి కార్యకర్తలు అసలు జనసేన మనకు వద్దు బాబోయ్ అంటూ బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయం ముందు వరుసగా ఆందోళనలు చేయడం పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ ఇచ్చింది.

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడానికి కూకట్ పల్లి, శేరిలింగం పల్లి టికెట్లను అడుగుతున్నారు. రెండు టికెట్లను ఇవ్వడానికి బిజెపి అధినాయకత్వం కూడా రెడీ అయింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. జనం లేని జనసేన పార్టీకి టికెట్ ఇస్తే సహించేది లేదని బిజెపి పార్టీ కార్యాలయం ముందు ఆందోళనల బాటపట్టారు.
అసలు జనసేనతో పొత్తు వద్దని మేము ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర నేతలపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు కూడా కూకట్ పల్లి కార్యకర్తలు బిజెపి కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఎట్టి పరిస్థితులలోను కూకట్ పల్లి సీటును జనసేనకు ఇవ్వద్దని ఆందోళన బాట పట్టారు.
పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తే ఓడిపోవడం ఖాయం అని, ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు టికెట్ ఇవ్వ వద్దని కోరుతున్న బీజేపీ వర్గాలు ఒకవేళ తమ మాట కాదని నిర్ణయం తీసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్తున్నారు. దీంతో ఇక్కడ గందరగోళంగా ఉంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం బీజేపీ వర్గాలు నిరసనలు తెలుపుతున్నాయి. మరి బీజేపీ అధిష్టానం ఏం చెయ్యబోతుంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications