Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్: టీఆర్ఎస్ లోకి పల్లె రవికుమార్ దంపతులు!!

మునుగోడు ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన పార్టీల లోని నాయకులు పార్టీలకు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేస్తూ బీజేపీ బాట పడుతుంటే, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పల్లె రవికుమార్ దంపతులు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఊహించని పరిణామాలతో ప్రధాన పార్టీల నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

కాంగ్రెస్ కు షాక్ .. టీఆర్ఎస్ లో చేరిన పల్లె రవికుమార్ దంపతులు

కాంగ్రెస్ కు షాక్ .. టీఆర్ఎస్ లో చేరిన పల్లె రవికుమార్ దంపతులు

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి గులాబీ పార్టీ లో చేరారు పల్లె రవికుమార్ గౌడ్ ఆయన భార్య కళ్యాణి . టిఆర్ఎస్ పార్టీ నుంచి గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైతే, ఆ స్థానంలో గౌడ సామాజిక వర్గం నుండి పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో పల్లె రవికుమార్ ఆయన సతీమణి టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పల్లె రవికుమార్

మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పల్లె రవికుమార్

కేటీఆర్ తోహైదరాబాద్ లో భేటీ అయిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు నేడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పల్లె రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టిఆర్ఎస్ పార్టీలోకి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆహ్వానించారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన పల్లె రవికుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టిఆర్ఎస్ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

మునుగోడు ఎన్నికల్లో తమ వంతు కృషి చేస్తామన్న పల్లె రవికుమార్

మునుగోడు ఎన్నికల్లో తమ వంతు కృషి చేస్తామన్న పల్లె రవికుమార్

ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టిఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్ దంపతులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని పల్లె రవికుమార్ కు కేటీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. తాము టిఆర్ఎస్ పార్టీ పట్ల, టిఆర్ఎస్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రభావితమై పార్టీలో చేరామని పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు తెలిపారు. తాజా ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.

చండూరును రెవెన్యూ డివిజన్ చెయ్యాలని కేటీఆర్ కు విజ్ఞప్తి

చండూరును రెవెన్యూ డివిజన్ చెయ్యాలని కేటీఆర్ కు విజ్ఞప్తి

చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్ కి తెలియజేశామన్నారు. మంత్రి కేటీఆర్ ఇందుకు సానుకూలంగా స్పందించారని, ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మా వంతు కృషిని చేస్తామని పేర్కొన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ చేరిక సమయంలో ఆయనతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ , టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+