అమిత్‌షా చెప్పులు మోసిన బండి సంజయ్: షాకింగ్ వీడియో వైరల్; రచ్చ మొదలెట్టిన టీఆర్ఎస్!!

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణంగా మారింది. సీఎం కేసీఆర్ సభతో మొదలైన మునుగోడు రచ్చ, ఇటు బిజెపి అమిత్ షా బహిరంగసభ తోనూ కొనసాగింది. సీఎం కెసిఆర్ సభలో తప్పులను వెతుకుతూ బీజేపీ టార్గెట్ చేస్తుంటే, బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా తెలంగాణాలో కాలు పెట్టిన సమయం నుండి ప్రతీ తప్పునూ టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది. ఇక తాజాగా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీని, బండి సంజయ్ ను టార్గెట్ చేయడానికి ఓ షాకింగ్ వీడియో దొరికినట్లయింది.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బండి సంజయ్ షాకింగ్ పని

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బండి సంజయ్ షాకింగ్ పని

మునుగోడులో బహిరంగ సభ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా నిన్న తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా నిన్న సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో బండి సంజయ్ చేసిన ఒక షాకింగ్ పని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమిత్ షా చెప్పులు చేతితో తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టిన బండి సంజయ్ .. వీడియో వైరల్

మహంకాళి అమ్మవారిని దర్శించుకుని కేంద్ర మంత్రి అమిత్ షా బయటకు రాగానే, ఆయనతో పాటు బయటకు వచ్చిన బండి సంజయ్ అమిత్ షా చెప్పులను చేతులతో తెచ్చి అమిత్ షా కాళ్ళ ముందు పెట్టారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో బిజెపి నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎప్పుడు దొరుకుతాడు అని చూస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ వీడియో పెద్ద ఆయుధంగా మారింది.

బీజేపీ నాయకులు బానిసత్వంతో బ్రతుకుతున్నారని ట్రోల్స్

బీజేపీ నాయకులు బానిసత్వంతో బ్రతుకుతున్నారని ట్రోల్స్


ఇక టిఆర్ఎస్ పార్టీ ఈ వీడియోని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఇంత బానిసత్వంతో బతుకుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ పరిస్థితి, అమిత్ షా కు చెప్పులు అందించే దుస్థితి అంటూ ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కూడా అదే బానిసత్వం తప్పదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆత్మాభిమానంతో ఉండాలని పదేపదే చెప్పుకునే బిజెపి నాయకులు, ఈ వీడియో చూశాక సమాధానం చెప్పాలని టార్గెట్ చేస్తున్నారు. ఇదేనా మీ ఆత్మాభిమానం అంటూ ప్రశ్నిస్తున్నారు.

బండి సంజయ్ గులాంగిరి సీఎం పదవికోసమేనా .. టీఆర్ఎస్ టార్గెట్

తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతీయులకు కాళ్లదగ్గర పెట్టిన బండి సంజయ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి చెప్పులు మోయాల్సిందే అంటూ, అందుకే తెలంగాణలో బీజేపీని ఓడించాలని పెద్ద ఎత్తున ఈ వీడియోను వైరల్ చేసే పనిలో పడ్డారు. బండి సంజయ్ పదవుల కోసం పాకులాడుతున్నాడని, అందుకే అవసరమైతే చెప్పులు కూడా మోస్తాడు అంటూ టార్గెట్ చేస్తున్నారు. ఈ గులాంగిరి దేనికోసం సీఎం పదవి కోసమేనా.. బండి సంజయ్ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+