సింగరేణి ఎన్నికలు వాయిదా.. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయంటే!!
తెలంగాణా రాష్ట్రంలో ఈనెల 28వ తేదీన జరగవలసిన సింగరేణి ఎన్నికలను హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఎన్నికలను వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. సింగరేణి ఎన్నికలు డిసెంబరు నెల 27వ తేదీన నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. నవంబర్ 30వ తేదీలోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర కార్మికశాఖ ఈనెల 28వ తేదీన సింగరేణిలో ఎన్నికలు జరపడానికి సిద్ధం అయ్యింది. అయితే ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన సింగరేణి యాజమాన్యం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. తాము అక్టోబర్ లో ఎన్నికలపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చెయ్యాలని కోరటం లేదని, కేవలం గడువు పొడిగించాలని కోరుతున్నామని సింగరేణి ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది.

అసెంబ్లీ ఎన్నికల కారణంగా అధికారులు సహకరించలేరని, మొత్తం 15 యూనియన్లకు 13 యూనియన్లు వాయిదాకు అంగీరిస్తున్నాయని పేర్కొంది. అయితే సింగరేణి అభ్యర్థనను విన్న హైకోర్టు ధర్మాసనం అందుకు అంగీకారం తెలిపింది.అక్టోబర్ లోగా సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలను నిర్వహించాలని సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన మేరకు తీర్పునిచ్చింది.
ఇదిలా ఉంటే గత సంవత్సరం నుండి సింగరేణి ఎన్నికల వివాదం కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ మూడుసార్లు హైకోర్టు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా మరోమారు ఎన్నికలు వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది.
ఎన్నికలకు సహకరిస్తామని రేపటిలోగా హామీ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వర్కర్స్ యూనియన్ లను ఆదేశించిన కోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ నెలలో 27వ తేదీన సింగరేణి ఎన్నికలు నిర్వహించనున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications