సింగర్ కల్పన ఇష్యూ.. వారికి తెలంగాణ మహిళా కమిషన్ వార్నింగ్
ఇటీవల అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని ఆస్పత్రిపాలైన సింగర్ కల్పన ప్రస్తుతం కోలుకున్నారు. అయితే, తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కల్పన సీరియస్‌గా స్పందించారు. ఈ క్రమంలోనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ మహిళా కమిషన్‌కు కల్పన ఫిర్యాదు చేశారు.
తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను ఆపాలని కమిషన్ కోరారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు చేస్తున్నవారిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వేదికగా తనపై అనేక తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.

ఈ క్రమంలోనే శనివారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు సింగర్ కల్పన ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన కోరారు.
ఈ నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రోలర్స్‌కు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ హెచ్చరించారు.
కాగా, హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చప్పారు. ఆయన వెంటనే కాలనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పడంతో వారొచ్చి.. తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది.
క్లారిటీ ఇచ్చిన కల్పన
తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదన్నారు సింగర్ కల్పన. తన కుమార్తె విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు.
ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు ప్రె నోట్ విడుదల చేశారు. తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తనకు, తన కుమార్తెకు చదువు విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థలతో నిద్రపట్టక అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని కల్పన చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications