సింగర్ మధుప్రియకు వేధింపులు... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు...
ప్రముఖ గాయని మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్,సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా తనకు అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని... గత రెండు రోజులుగా రాత్రి,పగలు తేడా లేకుండా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపులతో తాను మానసికంగా సతమతమవుతున్నానని... నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మధుప్రియ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నతనం నుంచే మధుప్రియ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'ఆడపిల్లనమ్మా' అంటూ ఆమె పాడిన పాట చాలా పాపులర్ అయింది. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి ఆడి పాడారు.ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. పలు సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడారు. 'ఫిదా' సినిమాలో మధుప్రియ పాడిన పాట 'వచ్చిండే... మెల్ల మెల్లగా వచ్చిండే...' పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గతేడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో 'హి ఈజ్ సో క్యూట్' అంటూ పాడిన పాట కూడా పెద్ద హిట్ అయింది.

Recommended Video
నాలుగేళ్లక్రితం బిగ్ బాస్ రియాలిటీ షోలో మధుప్రియ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఇంటి వాతావరణానికి అలవాటు పడలేకపోయిన ఆమె త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అటు సినిమా పాటలు,ఇటు ఫోక్ సాంగ్స్‌తో ప్రస్తుతం ఆమె తన సింగింగ్ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications