వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరా మీడియా బాస్?: సిట్ విచారణలో పూరి, శ్యాం సంచలనం, పెద్ద కుదుపే..

సదరు పత్రికాధిపతి తరుచూ గోవా వెళ్లి డ్రగ్స్ కార్యకలాపాల్లో ఉంటున్నట్లు సిట్ అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించే చర్చ. సిట్ విచారణ నేపథ్యంలో.. అంతిమంగా ఇందులో పట్టుబడేది ఎంతమందో చెప్పలేం గానీ.. విచారణలో మాత్రం పలు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

<strong>కెల్విన్‌కు ఉన్న ఆ అలవాటే కొంపముంచింది: సిట్ ఆధారాలకు నివ్వెరపోతున్న సినీ ప్రముఖులు</strong>కెల్విన్‌కు ఉన్న ఆ అలవాటే కొంపముంచింది: సిట్ ఆధారాలకు నివ్వెరపోతున్న సినీ ప్రముఖులు

ఇప్పటిదాకా సినీ-రాజకీయ రంగాలకే ఈ డ్రగ్స్ వ్యవహారం పరిమితమైందని భావిస్తున్నప్పటికీ.. ఇటు మీడియాకు సైతం ఈ పైత్యం పాకిందన్న విషయం తాజాగా వెలుగుచూసింది. సినీ తారలను విచారిస్తున్న సిట్ అధికారులు ఈ వివరాలను రాబట్టారు.

<strong>పూరిని రౌండప్ చేసిన మీడియా: ఊపిరాడట్లేదు.. ఫ్రస్టేషన్ లోనే ఆ నింద?</strong>పూరిని రౌండప్ చేసిన మీడియా: ఊపిరాడట్లేదు.. ఫ్రస్టేషన్ లోనే ఆ నింద?

ఉక్కిరిబిక్కిరైన పూరి.. శ్యాం:

ఉక్కిరిబిక్కిరైన పూరి.. శ్యాం:

సిట్ విచారణకు హాజరైన దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యాంకె నాయుడు అధికారుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కరైనట్లు తెలుస్తోంది. ఊపిరి సలపని రీతిలో వీరిపై ప్రశ్నల వర్షం గుప్పించిన సిట్.. పక్కా ప్లాన్‌తో వీరి మైండ్ సెట్ ను టార్గెట్ చేసి విచారిస్తోంది.

తాజా విచారణలో సిట్ ప్రశ్నలకు పూరి, శ్యాం మైండ్ బ్లాంక్ అయినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో తీవ్ర ఫ్రస్టేషన్ లో.. 'వాళ్లు మాత్రం గోవా వెళ్తే తప్పులేదా?' అంటూ మరో లీకు వదిలినట్లుగా సమాచారం.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
పూరి, శ్యాం చెప్పింది ఎవరి గురించి?:

పూరి, శ్యాం చెప్పింది ఎవరి గురించి?:

వాళ్లు మాత్రం గోవా వెళ్తే తప్పులేదా?.. అంటూ పూరి, శ్యాం కె నాయుడు చెప్పింది ఓ పత్రికాధిపతి గురించేనని సిట్ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. తొలుత అతనెవరనేది చెప్పడానికి బుకాయించిన వీరిద్దరూ.. సిట్ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో.. చివరకు సదరు పత్రికాధిపతి పేరు వెల్లడించక తప్పలేదని అంటున్నారు.

తాము మాత్రమే గోవాకు వెలల్డం లేదని, సదరు వ్యక్తులు కూడా అక్కడికి వెళ్లి వస్తున్నారని, అలాంటప్పుడు వారినెందుకు విచారించరని వీరిద్దరూ సిట్ ను ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

సాక్ష్యాలు సంపాదించే పనిలో:

సాక్ష్యాలు సంపాదించే పనిలో:

పూరి, శ్యాంకె నాయుడు చెప్పిన వివరాల మేరకు.. సదరు పత్రికాధిపతి గుట్టు కూడా రట్టు చేసే పనిలో ఉన్నారు సిట్ అధికారులు. సరైన సాక్ష్యాధారలు దొరికతే త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు పంపించాలని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, వీరిద్దరి విచారణ సందర్భంగా మరికొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా లీకైనట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన సాక్ష్యాలను కూడా వెతికే పనిలో పడింది సిట్. ఈ జాబితాలో మరో 11మంది వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

జర్నలిస్టులు కూడా!:

జర్నలిస్టులు కూడా!:

డ్రగ్స్ లింకులు మీడియాలోను బయటపడుతుండటం నివ్వెరపోయేలా చేస్తోంది. పలు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న 15మంది జర్నలిస్టులకు డ్రగ్స్ తో లింకులు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. మారేడుపల్లిలో పట్టుబడిన లోకల్ డ్రగ్ విక్రేత పీయూష్ సెల్ ఫోన్ లో వీరి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

పీయూష్ కు వారితో ఉన్న సంబంధాలపై విచారణలో అధికారలు పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం.
అధికారులు గుర్తించిన 15మంది జర్నలిస్టులకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. వీరంతా ఈ నెల 24న విచారణకు హాజరవనున్నట్లు తెలుస్తోంది.

English summary
Sit officials are found that a media boss also involved in Drugs case. In the SIT Interrogation director Puri Jagannath and Shyam K Naidu was revealed his name
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X