ఎన్ కౌంటర్ కు ముందే రూ.12 కోట్లు సెటిల్ చేసిన నయీం, రూ.2 కోట్లు ఓ పోలీసుకు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో లబ్దిపొందిన పోలీసు అధికారులు చాలామందే ఉన్నారని సిట్ అభిప్రాయపడుతోంది.ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడౌతున్నాయి. ఎన్ కౌంటర్ కు కొద్దిసేపటికి ముందే రూ.12 కోట్ల డీల్ ను నయీం సెటిల్ చేశాడు.అయితే ఈ కేసును తీసుకువచ్చిన ఓ పోలీసు అధికారికి ఈ డీల్ లో రూ.2 కోట్లు లబ్దిచేకూర్చినట్టు సమాచారం.

గత ఏడాది ఆగష్టు 8వ, తేదిన జరిగిన షాద్ నగర్ లోని మిలినీయం సిటీలో జరిగిన ఎన్ కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ కు కొద్దిసేపటికి ముందే నయీం సుమారు రూ.12 కోట్ల విలువైన డీల్ ను సెటిల్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఈ డీల్ కు సంబంధించిన సీసీటీవి పుటేజ్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తోంది.

SIT identified Rs.12 crore deal before gangster Nayeem encounter


నయీం ఎన్ కౌంటర్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ తో అంటకాగిన పోలీసు అధికారులు ఎవరనే విషయమై ఇప్పటికీ సిట్ డీజీపీకి నివేదికను అందించింది.ఈ నివేదిక ఆదారంగా ఇప్పటికే ఐదుగురు పోలీసులపై డిజిపి చర్యలు తీసుకొన్నారు.

నయీం కు బినామీలుగా ఎవరెవరు వ్యవహరించారు. వారి వద్దకు వచ్చే స్థిరాస్తుల కేసులు, ఆస్తి పంపకాలు, ఇతర తీవ్రమైన వివాదాల కేసులను నయీంకు అప్పగించేవారు కొందరు పోలీసు అధికారులు. అయితే ఈ కేసులను అప్పగించినందుకుగాను నయీం ఈ పోలీసులకు భారీగానే ముట్టజెప్పేవాడు.
నయీంతో సంబంధాలు కలిగి ఉన్న ఓ పోలీసు అధికారి ఏకంగా 16 ఎకరాల స్థలాన్ని తీసుకొన్నట్టు సిట్ గుర్తించింది.2008 తర్వాత ఛత్తీస్ ఘడ్ కు చెందిన కొందరు ఐపీఎస్ అధికారులు నయీంతో సంబంధాలను కలిగి ఉన్నారని సిట్ దర్యాప్తులో తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
SIT identified Rs.12 crore deal before gangster Nayeem encounter.it's seized cctv footage from encouter place. in this connection one police officer recevied Rs.2 crore from Nayeem.
Please Wait while comments are loading...