వ్యాపారలావాదేవీలు: నయీం కేసులో విద్యాసాగర రావుకు బిగుస్తున్న ఉచ్చు
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర రావుకు ఉచ్చు బిగుస్తోంది.
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర రావుకు ఉచ్చు బిగుస్తోంది. భువనగిరికి చెందిన వ్యాపారి నాగేందర్ కేసు ఛార్జీషీటులో ఆయన పేరు చేర్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
నయీంతో సంబంధాలున్నట్లుగా గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. సిట్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు ఆయనను విచారించారు. ఆదివారం నాడు మూడు గంటల పాటు విచారించారు.

విచారణలో నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
విద్యాసాగర రావు.. నయీంతో కలిసి వ్యాపార లావాదేవీలు జరిపినట్లు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. నయీం, విద్యాసాగర రావు బంధువులు కలిసి భూమి రిజిస్ట్రేషన్ చేయించిన ఆధారాలు ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విద్యాసాగర రావు తెలిపారు.












Click it and Unblock the Notifications