వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం అరాచకం: బయటపడ్డ అమ్మాయి అస్తిపంజరం, మాట విన్లేదని..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా నార్సింగి మంచిరేవుల శివారులోని ఓ ప్రాంతంలో అస్తిపంజరం కనిపించింది. ప్రహరీ నిర్మించి ఉన్న ఖాళీ స్థలంలో సోమవారం పోలీసులు దీనిని వెలికి తీశారు.

చిరిగిపోయిన ఎరుపురంగు గౌను మాత్రమే అస్తి పంజరం పైన ఉంది. ఇది నయీం ఇంట్లో పని చేసిన నస్రీన్ (17)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇటీవల నయీం అనుచరుడు ఫయీంను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ హత్య వెలుగు చూసింది.

పరిటాల ఎఫెక్ట్: బతికుండగా తన జీవితంపై సినిమా, డైరెక్టర్‌ని కలిసిన నయీం!నయీం కేసుల్లో వాస్తవాలతోపాటు అతడు క్రూరంగా హత్య చేసినవారి అస్థిపంజరాలు కూడా బయటపడుతుండటం గమనార్హం. నయీం వ్యవహారంలో తెలంగాణవ్యాప్తంగా 34 కేసులు నమోదు చేసిన పోలీసులు నయీం కుటుంబ సభ్యులతోపాటు గ్యాంగ్‌కు చెందిన మొత్తం 38 మందిని అరెస్టు చేశారు.

ఫర్హానా, అఫ్సానా, ఫయీం, షహీన్‌ను కస్టడీకి తీసుకుని విచారించి... అల్కాపురిలో హత్యకు గురైనవారు, ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలు రాబట్టారు.

 Skeleton Of teen allegedly killed by Gangster Nayeem found in Hyderabad

చెప్పిన మాట వినలేదని

చెప్పినమాట వినలేదన్న కోపంతో సమీప బంధువు కూతురు, ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న నస్రీన్‌కు నిద్రమాత్రలు వేసి నయీం చంపేశాడు. ఒకరోజు బంధువు అలీముద్దీన్ కూతురు అహెలా పెళ్లిచూపుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు నయీం, ఇంట్లోని వారు సిద్ధమయ్యారు.

ఆ సమయంలో అల్కాపురిలోని ఇంట్లో ఉండేందుకు నస్రీన్ నిరాకరించింది. ఇదే విషయమై చిన్నపాటి గొడవ జరగడంతో ఇంటిపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది. నయీం.. నస్రీన్‌ను గదిలోకి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టి, నిద్రమాత్రలు మింగించాడని, తర్వాత అందరం కలిసి పెళ్లిచూపులకు వెళ్లినట్లు ఫయీం పోలీసులకు వెల్లడించాడు.

'వైయస్ బతికుంటే నయీం పని అప్పుడే క్లోజ్ అయ్యేది'ఫంక్షన్‌ నుంచి అర్ధరాత్రి తిరిగొచ్చామని, నస్రీన్ చనిపోయినట్లు గుర్తించి.. నయీం, తాను, ఇతరులు కలిసి మృతదేహాన్ని రాత్రికిరాత్రి అల్కాపురికి సమీపంలోని మంచిరేవుల ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఫయీం ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం మంచిరేవుల ప్రాంతంలో రాజేంద్రనగర్‌ తహశీల్దార్‌, వైద్య బృందం సమక్షంలో తవ్వకాలు జరిపిన పోలీసులు అస్థిపంజరాన్ని బయటకు తీశారు.

డీఎన్ఏ పరీక్షలు

ఆ అస్తి పంజరం నస్రీన్‌దో కాదో తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా, కోర్టు అనుమతితో ఫర్హానా, అఫ్సానా, ఫయీం, షహిన్‌ల ఆరు రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం వారిని కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం మరోమారు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నయీం అక్క కారు డ్రైవర్ మహ్మద్ మసూద్ అలీని పోలీసులు మిర్యాలగూడలో సోమవారం అరెస్టు చేశారు.

English summary
Skeleton Of teen allegedly killed by Gangster Nayeem found in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X