హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవే: హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య 4 లేన్ రహదారి

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవే నిర్మించడంతోపాటు బుద్ధ విగ్రహాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం నెలకొల్పేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‌​ను పంపించింది. బుద్ధవనంలో 25 కోట్ల రూపాయలతో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం, ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటితో పాటు అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటును కూడా ప్రణాళికలో పొందుపరచాలని నిర్ణయించింది. నాగార్జునసాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్‌వాటర్ వరకు బోట్‌లో విహారించే ఏర్పాట్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది.

Skyway around Hussain Sagar 4 lane road between Hyderabad-Nagarjunasagar CM Revanth

హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు 4 లేన్ రహదారి

హుస్సేన్​‌సాగర్ పరిసరాలను ప్రపంచస్థాయి పర్యాటక హబ్‌గా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం సర్కిల్‌గా అభివృద్ధి చేయాలన్నారు.

ట్యాంక్‌బండ్, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్​ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఫుడ్​ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. గోల్కొండ చుట్టూ రోడ్లన్నీ ఇరుకుగా అయినందున, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని, ఆక్రమణలుంటే తొలగించాలన్నారు. అయితే అక్కడి ప్రజలు నిరాశ్రయులు కాకుండా పునరావాస చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్​‌లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+