స్మితా సబర్వాల్ దసరా ట్వీట్; ఆ మ్యాప్ విషయంలో రచ్చ; సీఎంఓ కార్యదర్శి క్షమాపణలు!!
తెలంగాణ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ దసరా ఉత్సవాల నేపథ్యంలో చేసిన ట్వీట్ మరోమారు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణమైంది. గతంలో దసరా ఉత్సవాల నేపథ్యంలో స్మితా సబర్వాల్ వివిధ రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిని తెలియజేసే ఇండియా మ్యాప్ ను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన మ్యాప్ తాజా వివాదానికి కారణమయ్యింది.

దసరా ఉత్సవాలపై స్మితా సబర్వాల్ పోస్ట్
ఇక తాజాగా దసరా ఉత్సవాల నేపధ్యంలో అన్ని రాష్ట్రాలలోనూ అమ్మవారిని దసరా సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, కానీ స్త్రీ, పురుష నిష్పత్తిలో మాత్రం రాష్ట్రాలలో వేరువేరుగా ఉందని ఆమె పోస్ట్ చేశారు. దీనికి ఆమె ఓ మ్యాప్ జతచేసి ఆసక్తికరంగా ఉందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలలో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువగా ఉందని స్మితాసబర్వాల్ ట్వీట్ చేశారు.

స్మితా సబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో కాశ్మీర్ పూర్తిగా లేదని నెటిజన్లు ఫైర్, ట్వీట్ డిలీట్
స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో కాశ్మీర్ సంపూర్ణంగా లేదని కొందరు నెటిజన్లు ఆమె పోస్ట్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో స్మితాసబర్వాల్ ఆ పోస్ట్ ను తొలగించారు. ఇక ట్విట్టర్ వేదికగా మరోమారు ట్వీట్ చేసిన స్మితాసబర్వాల్ మీలో చాలామంది ట్వీట్ ఆమోదయోగ్యం కాదని చెప్పిన కారణంగా, నేను క్షమాపణలతో దానిని తొలగిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. తన ఉద్దేశం ఎటువంటి మనోభావాలను దెబ్బ తీయాలని కాదని పేర్కొన్న స్మితాసబర్వాల్ అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ మరోమారు ట్వీట్ చేశారు.

మ్యాప్ డిలీట్ చెయ్యటంతో స్మితా సబర్వాల్ కు మద్దతుగా నెటిజన్లు
ఇక స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ డిలీట్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా స్మితా సబర్వాల్ పోస్టు చేసిన మ్యాప్ తప్పు కావచ్చు కానీ ఆమె భావన చాలా గొప్పదంటూ ప్రశంసలు కురిపించారు. ఆమె ఎక్కడా తప్పుగా ట్వీట్ చేయలేదని, ఒకసారి మానవత్వంతో గమనించాలి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తప్పు పోస్ట్ చేసి డిలీట్ చేశారని కొందరు నెటిజన్లు
మరికొందరు స్మితాసబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, అది తప్పు అని తెలిసిన తర్వాత ఆమె డిలీట్ చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీలో చాలా మందికి ట్వీట్ ఆమోదయోగ్యం కాదని చెప్పారు కాబట్టే డిలీట్ చేశాను అన్నట్టు చేసిన స్మితాసబర్వాల్ ట్వీట్ ను కూడా కొందరు తప్పు పడుతున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో స్మితాసబర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్ట్ లు ప్రజలలో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అసంపూర్ణంగా ఉన్న ఇండియా మ్యాప్ తో స్మితాసబర్వాల్ చేసిన పోస్ట్ కూడా చర్చనీయాంశంగా మారింది.

బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై స్మితా సబర్వాల్ ట్వీట్ వివాదం
ఇంతకు ముందు బిల్కిస్ బానో కేసులో దోషులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడంపై స్మితాసబర్వాల్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బిల్కిస్ బానో కేసులో దోషులను ప్రభుత్వం విడుదల చేయడం వార్తలను చదివి తను అవిశ్వాసంతో ఉన్నానని, భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే బిల్కిస్ బానో హక్కును కోల్పోయిందని, మనల్ని మనం స్వేచ్ఛ దేశంగా చెప్పుకోలేం అంటూ స్మితాసబర్వాల్ ట్వీట్ చేశారు. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో స్మితాసబర్వాల్ ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఆమెకు మద్దతుగా కొందరు, ఆమె రాజకీయ నాయకుల్లాగా మాట్లాడారని ప్రతికూలంగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications