వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు మాటే రేవంత్: నాయిని, చేరికలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై విషం కక్కడం మానలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడాలనుకున్న మాటలను ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డితో పలికిస్తున్నారనే విషయం అందరికీ తెలుసునని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఉప్పల్, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు నోముల నర్సింహయ్య నాయకత్వంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా బంగారు తెలంగాణ సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి టిడిపి కుట్ర పన్నుతోందని అన్నారు. జలయజ్ఞంలోకోట్లు మింగిన పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు.

టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలనే కుట్రతో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వమే భూమి కేటాయిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అంటకట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలతో తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీయాలనేదే టిడిపి కుట్ర అని విమర్శించారు.

తెలంగాణ పౌర హక్కుల సాధన కోసమే టిఆర్‌ఎస్ ఆవిర్భవించిందని టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు తెలిపారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. నవ తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని అన్నారు. కార్యకర్తలు టిఆర్‌ఎస్ పార్టీకి రథసారథులని అన్నారు. చంద్రబాబు చేతిలో రేవంత్ కీలుబొమ్మ అని నోముల నర్సింహ్మయ్య అన్నారు.

చేరికలు

చేరికలు

ఆదివారం తెలంగాణ భవన్‌లో ఉప్పల్, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు నోముల నర్సింహయ్య నాయకత్వంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.

నాయిని

నాయిని

విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై విషం కక్కడం మానలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేరికలు

చేరికలు

చంద్రబాబు తాను మాట్లాడాలనుకున్న మాటలను ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డితో పలికిస్తున్నారనే విషయం అందరికీ తెలుసునని నాయిని అన్నారు.

కేశవరావు

కేశవరావు

తెలంగాణ పౌర హక్కుల సాధన కోసమే టిఆర్‌ఎస్ ఆవిర్భవించిందని టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు తెలిపారు.

నాయిని

నాయిని

ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా బంగారు తెలంగాణ సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

జూపల్లి కృష్ణారావు

జూపల్లి కృష్ణారావు

మెట్రో రైలుపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమేనని, లేనట్లయితే రేవంత్ రెడ్డి గుండు గీయించుకోవాలి.. లేదా ఆయనను ఆడిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుకు గుండు గీయించాలని అన్నారు.

జితేందర్ రెడ్డి

జితేందర్ రెడ్డి

సీమాంధ్ర బాబుల మోచేతి నీళ్లు తాగుతూ విచక్షణ కోల్పోయి మాట్లాడటం తగదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే పాలమూరు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రేవంత్‌ను హెచ్చరించారు.

గువ్వల బాలరాజు

గువ్వల బాలరాజు

సీమాంధ్ర కమీషన్లకు అలవాటు పడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ గౌరవాన్ని సీమాంధ్ర బాబుల వద్ద తాకట్టు పెడుతున్నారని రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా వాసి కావడం తమకు అవమానంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వంపై ఇకనైనా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి టిడిపి కుట్ర పన్నుతోందని అన్నారు.

English summary
Some leaders and workers from CPI and CPM leaders joined in Telangana Rashtra Samithi on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X