పాన్ లో విషంపెట్టి చంపాలనుకొన్నవాడిని వదిలేశా, మంత్రి పదవిపై ఆశలేదు: బాబుమోహన్

తాను మంత్రిగా ఉన్న సమయంలోపాన్ లో విషం కలిపి చంపాలని ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. అయితే తనకు పాన్ లో విషం పెట్టాలనుకొన్నవాడు తన కాళ్ళమీద పడి ఏడ్చాడని చెప్పాడు. ఆంథోల్ ఎమ్మెల్యే బాబుమోహన్.

హైదరాబాద్: తాను మంత్రిగా ఉన్న సమయంలోపాన్ లో విషం కలిపి చంపాలని ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. అయితే తనకు పాన్ లో విషం పెట్టాలనుకొన్నవాడు తన కాళ్ళమీద పడి ఏడ్చాడని చెప్పాడు. ఆంథోల్ ఎమ్మెల్యే బాబుమోహన్. అయితే తన ప్రత్యర్థులే ఈ పథకాన్ని రచించారని తెలిసి అతడిని వదిలేసినట్టు చెప్పారు.

సినీ నటుడు, ఆంథోల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ ను ఆంధ్రజ్యోతి ఎబిఎన్ ఛానల్ లో రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రమంలో బాబుమోహన్ ను ఆయన సినీ, రాజకీయ జీవితం గురించి పలు ఇంటర్వ్యూ చేశారు.

అయితే తన జీవితంలో జరిగిన ఘటనలను బాబుమోహన్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు.తన కొడుకు చనిపోయిన తర్వాత బతకడం వేస్ట్ అనే స్థితిలో ఉన్నానని చెప్పారు.అయితే తర్వాత కాలంలో చోటుచేసుకొన్న మార్పులతో సాధారణ జీవితంలోకి అడుగుపెట్టినట్టు ఆయన చెప్పారు.

పాన్ లో విషం పెట్టి చంపాలనుకొన్నారు

పాన్ లో విషం పెట్టి చంపాలనుకొన్నారు

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో తాను మంత్రిగా పనిచేశానని బాబుమోహన్ చెప్పారు.సినిమాల్లో నటించే సమయంలో తనికెళ్ళ భరణి ద్వారా పాన్ లు తినే అలవాటు వచ్చిందన్నారు.అయితే ప్రతిరోజూ తాను ఎక్కడికి వెళ్ళినా హైద్రాబాద్ లోని ఓ పాన్ షాపులో పాన్ లు కట్టించుకొనే తీసుకెళ్ళేవాడిని.అయితే ఈ పాన్ లో విషం కలిపి చంపాలని ప్రత్యర్థులు కుట్రపన్నారని తెలిసి ఆ షాపులో పాన్ లు కట్టించుకోవడం మానేసినట్టు ఆయన చెప్పారు.మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా ఎస్ పి పాన్ లో ఎవరైనా విషం పెట్టి చంపొచ్చు గదా అని అడిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఎస్ పి యాధృఛ్చికంగా అడగలేదన్నారు. అయితే ఆ రోజు నుండి ఆ పాన్ షాపులో పాన్ లు కట్టించుకోవడం మానేసినట్టు చెప్పారాయన. అయితే తనకు పాన్ లో విషం పెట్టాలనుకొన్న వ్యక్తి తన కాళ్ళ మీద పడి ఏడ్చాడని చెప్పారు.అయితే ప్రత్యర్థులు పన్నిన కుట్రలో అతను ఈ పనిచేశాడని అతడిని వదిలేసినట్టు చెప్పారు.

మళ్ళీ మంత్రి కావాలనే ఆశ లేదు

మళ్ళీ మంత్రి కావాలనే ఆశ లేదు

చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాను. అయితే టిఆర్ఎస్ లోచేరిన తర్వాత మరోసారి మంత్రిపదవిని చేపట్టాలనే ఆశలేదన్నారు బాబుమోహన్, కెసిఆర్ తనకు గాడ్ పాదర్ అన్నారు. తనకు మంత్రిపదవిని ఎందుకు అన్నారు. ప్రశాంత జీవితాన్ని కోరుకొంటున్నట్టు చెప్పారాయన,.అంతేకాదు ముఖ్యమంత్రి కూడ మెదక్ జిల్లా నుండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాంటిది తనకు మంత్రి పదవి అవసరం లేదన్నారు.అయితే మంత్రిపదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫర్వాలేదన్నారు.అంతేకాదు మంత్రిపదవిని ఆశించడమే తప్పన్నారు. తన రాజకీయజీవితంలో రెండో ఇన్సింగ్స్ ప్రారంభమైందన్నారు. ఏం చేయాలో తెలియనప్పుడు కెసిఆర్ పిలిచి టిక్కెట్టు ఇచ్చారు.

కొడుకు మరణంతో సైలెంటయ్యాను

కొడుకు మరణంతో సైలెంటయ్యాను

పెద్దకొడుకు చనిపోవడంతో సైలెంటయ్యాను. ఆ సమయంలో జీవితం ఇక చాల్లే అనుకొన్నానని బాబుమోహన్ చెప్పారు. సినిమాల్లో నటుడిగా వెలుగొందాను. ప్రభుత్వ ఉద్యోగం చేశాను. మంత్రిగా పనిచేశాను. అన్నీ అయిపోయాయి.ఈ జీవితం ఎందుకు అనుకొన్నానని చెప్పారు. చచ్చిపోతే తన కొడుకు వద్దకు పోవచ్చనిపించింది. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేదన్నారు. ఎప్పుడూ తలుపులేసుకొని గదిలో ఉండేవాడినని చెప్పారు. ఎంతోమందికి అన్నం పెట్టాను,. పెళ్ళిళ్ళు చేశాను.సహయం చేశాను. కానీ, ఈరోజు తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటా.. అని ఓ రోజు తలుపులు తీసుకొని గది నుండి బయటకు వచ్చానని బాబుమోహన్ చెప్పారు.

సినిమా, రాజకీయాలు వెజిటేరియన్, నాన్ వెజిటెరియన్ లాంటివి

సినిమా, రాజకీయాలు వెజిటేరియన్, నాన్ వెజిటెరియన్ లాంటివి

ఒకటి వెజిటేరియన్, మరోకటి నాన్ వెజిటేరియన్ లాంటివని సినిమా, రాజకీయాల గురించి బాబుమోహన్ అభిప్రాయపడ్డారు. వెజ్ లో ఇష్టమైన వంటకాలు ఉన్నట్టే, నాన్ వెజ్ లో కూడ ఇష్టమైన వంటకాలు ఉంటాయన్నారు. ఆ సమయంలోనే టేస్ట్ ను బట్టి ఏదో ఒకటి..వెజ్ లేదా నాన్ వెజ్ అనుకొంటానని ఆయన చెప్పారు.

పేదలకోసమే పనిచేస్తా

పేదలకోసమే పనిచేస్తా

రాజకీయాల్లోకి వచ్చి23 ఏళ్ళు అయింది. అయితే మూడు వర్గాల ప్రజలుంటారని రాజకీయాల్లో ఉన్నంత కాలం అర్థం చేసుకొన్నట్టు చెప్పారు. ఎంతపెద్ద పనైనా చేయించుకోగలిగేవారు మొదటిరకం. ఆ వర్గానికి ఏ పార్టీ ఉన్నా ఒక్కటే. డబ్బు పనిచేసి పెడుతోంది. మరో వర్గం ఎలాంటి పనైనా రికమండేషన్ తో చక్కబెట్టుకోవడం. ఇక మూడో వర్గం డబ్బులు పెట్టలేక, రికమండేషన్స్ చేయించుకోలేక పని అవ్వక దిక్కులు చూస్తుంటారు.అందుకే తాను పేదవాళ్ళకు పని చేయడం కోసం ఫోకస్ పెట్టాను. ఆఫీసర్లను అడిగి మరీ పనులు చేయించగలిగానని చెప్పారు బాబుమోహన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+