కూర వండలేదని కన్న కొడుకుని రోకలి బండతో మోది చంపాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కూర వండలేదని కన్న కొడుకుని ఓ తండ్రే హత్య చేసిన ఘటన జిల్లాలోని భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామంలో జరిగింది. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానిక సీఐ సీహెచ్‌ రఘునందన్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన బొడ్డు సమ్మయ్య, అతని కుమారుడు దేవేందర్‌ (22)లు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సమ్మయ్య భార్య రండేళ్ల క్రితం మృతి చెందగా, కుమార్తె స్వరూపకు ఏడాది క్రితం వివహ చేశాడు. ఇక సమ్మయ్య తన కొడుకు వీరేందర్‌తో అదే ఇంట్లో ఉంటున్నారు.

ఈ క్రమంలో సమ్మయ్య మంగళవారం ఉదయం కూలీ పనికి వెళ్లే సమయంలో ఇంట్లో కూర లేకపోవడంతో కారంపొడి వేసుకుని భోజనం క్యారేజీని తనవెంట తీసుకెళ్లాడు. కూలీ పనికి వెళుతూ సాయంత్రానికి కూర వండమని కుమారుడు దేవేందర్‌కు తన జేబులోని డబ్బులు ఇచ్చాడు.

son murdered by his father in bhupalpally in warangal district

తండ్రి ఇచ్చిన డబ్బులతో దేవేందర్ కూర వండకుండా, వాటిని తన జల్సాలకు ఖర్చు చేశాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన సమ్మయ్య కూర ఎందుకు వండలేదని కుమారుడిని ప్రశ్నించాడు. చిన్నగా మొదలైన ఈ గొడవ చివరకు ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణకు దారి తీసింది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సమ్మయ్య దేవేందర్‌ నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో తలపై మోది చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే దేవేందర్‌ను కూలీ పనులకు పిలిచేందుకు చుట్టుపక్కల ఇళ్ల వారు సమ్మయ్య ఇంటికి వచ్చారు.

ఇంటి బయట నుంచి ఎంత సేపు పిలిచినా బయటకు రావడంతో స్థానికులు తలుపు తెరచి చూడగా అతడు ఇంట్లో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని మృతుడి సోదరికి ఫోన్‌లో తెలియజేసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
son murdered by his father in bhupalpally in warangal district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X