ముగ్గురు భార్యలు: కనికరించని దత్తపుత్రుడు
హైదరాబాద్: ఓ వ్యక్తిని దత్తపుత్రుడు ఆస్తి కోసం హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం ఆలంపల్లి గ్రామానికి చెందిన అశోక్ (75) కు ముగ్గురు భార్యలు. మొదటి భార్య చాలా కాలం క్రితం మృతి చెందగా, మల్లీశ్వరిని రెండో వివాహం చేసుకున్నాడు.కొంత కాలానికి మల్లీశ్వరి కూడా అశోక్ నుంచి దూరంగా ఉండడంతో మూడో పెళ్లి చేసుకున్నాడు. కాగా మూడో భార్య కూడా అతన్ని విడిచి వెళ్లిపోయింది.
కొంతకాలం క్రితం శ్రీధర్ అనే వ్యక్తిని అశోక్ దత్తత తీసుకున్నారు. చక్కగా చూసుకుంటానని నమ్మించిన శ్రీధర్ మొత్తం ఆస్తి రాయించుకున్నాడు. అశోక్ ఈ నెల 4న మృతి చెందాడు. నాలుగు రోజులుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అశోక్ శవం ఇంట్లోనే ఉంది.

దత్త పుత్రుడు శ్రీధర్ మోమిన్‌పేట బ్యాంక్‌లో పని చేస్తూ అశోక్‌ను మభ్యపెట్టి 6.07 గుంటల భూమి, ఇల్లును తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య మహేశ్వరి, కూతురు కల్యాణి కోర్టులో కేసు వేశారు. పదేండ్లుగా ఈ కేసు నడుస్తున్నది.
ఇంతలోనే అశోక్ అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఆస్తి వ్యవహారం తేలకపోవడం, దత్త పుత్రుడు కర్మకాండలు చేయకుండా అజ్ఞాతంలోకి వెళ్లగా మూడు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. దీంతో అశోక్ భార్య, కూతురు భిక్షాటన చేసి స్థానికుల సహాయంతో కర్మకాండలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications