రంగంలోకి సోనియా - తెలంగాణపై సెంటిమెంట్ అస్త్రం..!!
తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందు కోసం కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణ లో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ సిద్దమైంది. ఇక, సోనియా గాంధీ రంగంలోకి దిగుతున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసారు. మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు.
సోనియాతో సభ..మేనిఫెస్టో:తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఈ సారి ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ లక్ష్యంగా మారింది. పరిస్థితులు తమకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని భావిస్తోంది. ఈ సమయంలోనే ఆకర్షణీయ మేనిఫెస్టోతో పాటుగా సెంటిమెట్ అస్త్రాలను సంధించేందుకు సిద్దమవుతోంది.సెంటిమెంటుతోపాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకు రావడమే కాకుండా ఏకంగా అధినేత్రినే రంగంలోకి దింపాలని భావిస్తోంది. సెప్టెంబరు 17న రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది.

సెంటిమెంట్ అస్త్రం:తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమెతో తెలంగాణ ప్రజలకు పిలుపు ఇప్పించనుంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనూ ఆ సభలోనే ప్రకటించాలని నిర్ణయించింది. అందులో భాగంగా, తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న సోనియా సభను ఏర్పాటు చేసి.. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ఆమెతో పిలుపును ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
గడిచిన రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్‌కు పని చేస్తే.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, సోనియా పిలుపుతో ఆ అస్త్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తోంది. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోనూ ప్రకటించి క్షేత్రస్థాయి నుంచీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, పార్టీ మేనిఫెస్టోను ప్రతి గడపకూ చేరుస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు భారీ సభలకు ప్లాన్:ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్యలను ఆహ్వానించి మూడు భారీ సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబరు ఏడో తేదీ వరకూ ప్రియాంక గాంధీ షెడ్యూలు ఖాళీ లేకపోవడంతో ఈ లోపునే ఖర్గే, సిద్దరామయ్య సభలను నిర్వహించాలని భావిస్తోంది.

ఈనెల 18న తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఖర్గే సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, బీసీ డిక్లరేషన్‌పైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సెప్టెంబరు 7 తర్వాత ప్రియాంక సభను ఏర్పాటు చేసి అందులో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications