Medaram: మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
తెలంగాణ కుంభమేళా కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు తరలి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు.. అధికారులను అక్కడ మొహరించింది. కాగా, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇక.. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను మేడారం జాతరకు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్ల రూట్.. షెడ్యూల్ ను ప్రకటించింది.
ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్‌కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి మేడారం జాతర ప్రత్యేక రైళ్లు వరంగల్, కాజీపేటల వరకు నడవనున్నాయి. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం జాతర ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్ రిజర్వుడ్ జనసాధారణ రైళ్లని జాతర వెళ్లే భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 28, 30, ఫిబ్రవరి 1 తేదీల్లో సికింద్రాబాద్ -మంచిర్యాల్- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు కాజీపేట మీదుగా కాజీపేట మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్-మంచిర్యాల్ రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాల్ చేరుకుంటుంది.

తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల్-సికిందరాబాద్ రైలు (07496) మంచి ర్యాల్‌లో బయలుదేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈనెల 29, 31 తేదీల్లో సికింద్రారాబాద్-సిరిపూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ మేడారం (07497/07498) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి, ఈ తేదీలలో మేడారం జాతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్ చేరుకుంటాయి. అదే రోజు మద్యాహ్నం 2.30 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ మేడారం జాతర ప్రత్యేక రైళ్లు (07498/07499) ఈ నెల 28 నుంచి 31 వరకు రాకపోకలు సాగిస్తాయి.
ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి. ఇక.. నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట-ఖమ్మం మేడారం ప్రత్యేక రైళ్లు (07503/07504) ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి.
ఆదిలాబాద్-కాజీపేట (07501)మేడారం జాతర ప్రత్యేక రైలు ఈ నెల 28న రాత్రి 11.30 గంటలకు ఆదిలాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు (29 తేదీ) ఉదయం 11.45 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. అలాగే కాజిపేట-ఆదిలాబాద్ (07502)మేడారం ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేది మధ్యాహ్నం 1.15 గంటలకు కాజీపేటలో బయలుదేరి మరుసటి రోజు (30వ తేదీ) తెల్లవారు జామున 4 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications