వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటల రాజేందర్‌పై అనర్హత వేటు..!! టీఆర్ఎస్ చేతికి ఇద్దరూ చిక్కారు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ రాజకీయ యుద్దం కొత్త టర్న్ తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ..కేంద్రంలో ఉన్న బీజేపీ తమకు అన్న అన్ని అవకాశాలతో టీఆర్ఎస్ ను ఇరకాటంటోకి నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయంగా రెండు పార్టీలు ఎత్తులు -పై ఎత్తులతో ముందుకు కదులుతున్నాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 17 నాడు రాష్ట్రం - కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణకు రంగం సిద్దం అవుతోంది. ఈ సమయంలోనే..బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా టీఆర్ఎస్ అధినాయకత్వం కొత్త వ్యూహాలను పదును పెడుతోంది.

టీఆర్ఎస్ చేతికి చిక్కిన ఇద్దరూ

టీఆర్ఎస్ చేతికి చిక్కిన ఇద్దరూ

అందులో భాగంగా.. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రాజాసింగ్ పైన పీడీ యాక్టు నమోదైంది. అనుచిత వ్యాఖ్యలు.. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఆయన వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో..ఆయన పైన నమోదు చేసిన పీడీ యాక్టు పైన రాజాసింగ్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీని పై కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక, శాసనసభ్యుడిగా రాజాసింగ్ చేసిన ప్రమాణం ఉల్లంఘించారని, ఆయన పైన ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఎంఐఎం స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది.

స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలతో

స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలతో

ఇక, ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ పైన అనర్హత వేటు వేసేందుకు వీలుకు ప్రతిపాదించేందుకు వీలుగా టీఆర్ఎస్ కు అస్త్రం చిక్కింది. ఇప్పుడు దీనిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలను త్వరగా ముగించటంతో పాటుగా స్పీకర్ పైన ఈటల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మర మనిషి లాగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చెప్పింది చేయడం తప్ప.. స్పీకర్‌‌ పోచారానికి వేరే పని లేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

మంత్రి వ్యాఖ్యలతో పిక్చర్ క్లియర్

మంత్రి వ్యాఖ్యలతో పిక్చర్ క్లియర్

ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై ఈటల వ్యాఖ్యలు దుర్మార్గమని మండిపడ్డారు. సభాపతిని మరమనిషి అంటూ కించపరుస్తూ ఈటల మాట్లాడారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు స్పీకర్‌ వింటున్నారంటూ అగౌరవ పరుస్తూ ఈటల మాట్లాడడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. స్పీకర్‌కు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు. దీని ద్వారా ఈటల రాజేందర్ స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల పైన క్షమాపణ చెబితే..ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. లేకుంటే, చర్యల దిశగా సభలోనే ప్రతిపాదన చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ కీలక నేతల్లో చర్చ జరుగుతోంది.

ఈటల తగ్గుతారా..ఛాన్స్ ఇస్తారా

ఈటల తగ్గుతారా..ఛాన్స్ ఇస్తారా

అదే సమయంలో రాజాసింగ్ వ్యవహారం పైన స్పీకర్ సభ అభిప్రాయం కోరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. సున్నితమైన అంశం కావటంతో..దీని పైన సభలో అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకొని స్పీకర్ నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ చేతిలో ఈటల వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి. మునుగోడు ఉప ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఈటల అధికార పార్టీకి ఛాన్స్ లేకుండా తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటారో..లేక, ఈ విషయం పైన టీఆర్ఎస్ ప్రభుత్వం సభా వేదికగా ముందుకే వెళ్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమవుతోంది.

English summary
TRS Govt moving action against BJP MLA Etala Rajender in the Assembly on his comments on Speaker Pocaharam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X