• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూనియ‌ర్ ఎంటీఆర్ ప్ర‌చారం పై ఊహాగానాలు..! అస‌లు భార‌త్ లో లేని కంత్రి..!!

|

హైద‌రాబాద్ : యంగ్ టైగ‌ర్ ఎంటీఆర్ తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా మ‌హాకూట‌మి త‌రుపున ప్ర‌చారం చేస్తారా.. చేయ‌రా అనే అంశం పై సందేహాలు నెల‌కొన్నాయి. ఇంత‌కి కుంటుంబ స‌భ్యులు ఎవ‌రు కూడా గ్రేట‌ర్ తో పాటు కూక‌ట్ ప‌ల్లి లో జూనియ‌ర్ ప్ర‌చారం చేస్తాడ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. ఎవ్వ‌రు కూడా ఆ విశ‌యాన్ని ఇంత‌వ‌ర‌కూ నిర్ధారించ‌లేదు కూడా. మీడియాలో మాత్రం అదుగో జూనియ‌ర్., ఇదిగో జూనియ‌ర్ ప్ర‌చారం అంటే ఊహాజ‌నిత క‌థ‌నాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వ‌స్తున్నాయి. అస‌లు జూనియ‌ర్ ఎంటీఆర్ కూక‌ట్ ప‌ల్లి లో ప్ర‌చారం చేస్తారా..? ఆయ‌న భారతో లో ఉన్నారా..లేక విదేశాల్లో ఉన్నారా..? ఎందుకు జూనియ‌ర్ ప్ర‌చారం గురించి ఇంత‌గా మీడియా ప్ర‌చార్ చేస్తోంది. అస‌లు జూనియ‌ర్ మ‌న‌సులో ఏంముంది..? ఆయ టార్గెట్ ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

జూనియ‌ర్ ప్ర‌చారంపై సందిగ్ద‌త‌..! విదేశాల్లో ఉన్న సింహాద్రి..!!

జూనియ‌ర్ ప్ర‌చారంపై సందిగ్ద‌త‌..! విదేశాల్లో ఉన్న సింహాద్రి..!!

జూనియ‌ర్ ఎంటీఆర్.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ ఉంది. యంగ్ టైగ‌ర్ గా, యాంగ్రీ యంగ్ మెన్ గా మంచి ముద్ర వేసుకున్నారు ఎంటీఆర్. నంద‌మూరి కుటుంబంలో బాల‌క్రిష్ణ త‌ర్వాత అంత‌టి స్థాయిని తెచ్చుకున్న ఏకైక న‌టుడు ఎంటీఆర్. సినిమాల‌తో పాటు రాజ‌కీయ ఉప‌న్యాల‌సాలు ఇవ్వ‌డంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంద‌ని 2009 ఎన్నిక‌ల్లో నిరూపించుకున్నారు జూనియ‌ర్. మంచి క్రౌడ్ పుల్ల‌ర్ గా కూడా ఎంటీఆర్ పేరు తెచ్చుకున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు రాజ‌కీయ కౌంట‌ర్ ఇవ్వ‌డంలో కూడా పరిప‌క్వ‌త చూపిస్తాడ‌నే ముద్ర వేసుకున్నారు జూనియ‌ర్.

 అక్క గెలుపుకు త‌మ్ముడి స‌హాకారం కావాలంటున్న అభిమానులు..! స్పందించ‌ని జూనియ‌ర్ వ‌ర్గం..!!

అక్క గెలుపుకు త‌మ్ముడి స‌హాకారం కావాలంటున్న అభిమానులు..! స్పందించ‌ని జూనియ‌ర్ వ‌ర్గం..!!

2009 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో జూనియ‌ర్ విస్త్రుత ప్ర‌చారం నిర్వ‌హించారు. కాని అప్పుడు వైయ‌స్ ప్ర‌భంజ‌నం ముందు తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయింది. దాంతో మ‌ళ్లి రాజ‌కీయాల‌వైపు చూడ‌కుండా సినిమాల‌పైన ద్రుష్టి కేంద్రీక‌రించారు ఎంటీఆర్. త‌ర్వాత అప్పుడ‌ప్పుడ‌ప్పుడూ రాజ‌కీయాల గురించి మాట్లాడినా త‌న‌కు ఇంకా స‌మ‌యం ఉంద‌ని, రాజ‌కీయాల్లోకి త‌న అవ‌స‌రం ఉంద‌నుకున్న‌ప్పుడు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని అభిమానుల‌కు స‌ర్ది చెప్తుంటారు ఎంటీఆర్. ప్ర‌స్తుతం త‌న టార్గెట్ రాకీయాలు కాద‌ని, సినిమాల్లో న‌టించ‌డంపైనే ఉంద‌ని చెప్పుకొచ్చారు ఎంటీఆర్.

మ‌హాకూట‌మి త‌రుపున త‌రుపున ప్రచారం..! ఏ విష‌యం తేల్చ‌ని టెంప‌ర్ హీరో..!!

మ‌హాకూట‌మి త‌రుపున త‌రుపున ప్రచారం..! ఏ విష‌యం తేల్చ‌ని టెంప‌ర్ హీరో..!!

తాజాగా తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి లో భాగంగా తెలుగుదేశం పార్టీ మొత్తం 13నియోజ‌క వ‌ర్గాల్లో పోటీ చేస్తోంది. ఈ 13
నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయాల‌ని టీడిపి ముఖ్య‌నేత‌లు భావిస్తున్నారు. అందులో కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో సొంత అక్క సుహాసిని పోటీ కి దిగారు. జూనియ‌ర్ ఎంటీఆర్ కి అస‌లు ట్విస్ట్ ఇక్క‌డే మొద‌ల‌య్యంది. తాను 13నియోజ‌క వ‌ర్గాల్లో ప్ర‌చారం నిర్వ‌హించ‌క పోయినా కూక‌ట్ ప‌ల్లిలో మాత్రం అక్క సుహాసిని త‌రుపున ప్ర‌చారం నిర్వ‌హించాల‌నే డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది. ఇదే అంశం జూనియ‌ర్ ఎంటీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. తాను ప్ర‌చారంలో పాల్గొంటారా లేదా అనే అంశం పై ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా ఆయ‌న స్వ‌యంగా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు కూడా. అస‌లు అక్క ప్ర‌చారం విష‌యంలో జూనియ‌ర్ ఎందుకు పెద‌వి విప్ప‌ట్లేద‌నే చ‌ర్చ టీడిపి వ‌ర్గాల్లో తారా స్థాయిలో జ‌రుగుతోంది.

ఎంటీఆర్ టార్గెట్ రాష్ట్రం..! నియోజ‌క వ‌ర్గం కాద‌నే చ‌ర్చ కూడా న‌డుస్లోంది..!!

ఎంటీఆర్ టార్గెట్ రాష్ట్రం..! నియోజ‌క వ‌ర్గం కాద‌నే చ‌ర్చ కూడా న‌డుస్లోంది..!!

జూనియ‌ర్ ఎంటీఆర్ లాంటి మిస్సైల్ ను ఓ రాష్ట్ర ఎన్నిక‌ల కోసం వాడుకోవాల‌ని గాని ఒక్క నియోజ‌క వ‌ర్గంలో ఒకే ఒక అభ్య‌ర్థి గెలుపుకోసం వ‌డుకోవ‌డం ఏంట‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. జూనియ‌ర్ ఎంటీఆర్ ఓ ప్ర‌తిప‌క్ష పార్టీమీద ఉండాల‌ని, రాష్ట్రంలో పార్టీని సింగిల్ హాండ్ తో గెలిపించుకోనే సామ‌ర్థ్యం ఉన్న నాయ‌కుడిని ఒక ప్రాంతానికి ప‌రిమితం చేసి స్థాయిని త‌గ్గించండం ఎందుక‌నే చర్చ‌కూడా జ‌రుగుతోంది. జూనియ‌ర్ మ‌దిలో కూడా ఇదే అలోచ‌న ఉన్న‌ట్టు ఆయన అత్యంత స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాజంమౌళి షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న జూనియ‌ర్ ఇప్ప‌ట్లో భార‌త్ కు వ‌చ్చే అవ‌కాశాలు కూడా లేవ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చినా కూక‌ట్ ప‌ల్లి లాంటి నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు సుముఖత చూపించ‌క‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ కూడా జూనియ‌ర్ స‌న్నిహిత్తుల్లో జరుగుతోంది.

English summary
Junior NTR a part of the Telangana Pre-election campaign. There is no mention of whoever the family members of the family are going to junior in Kuttatpalli along with Greater. Nobody has ever confirmed the concept.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X