లైంగికదాడి, తర్వాత హత్య : శ్రావణి హత్యపై పోస్టుమార్టం రిపోర్ట్, ఒకరి అరెస్ట్
యాదాద్రి : విద్యార్థిని శ్రావణి హత్యకు సంబంధించి వివరాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యాయి. తొలుత శ్రావణిపై అత్యాచారం చేశారని వైద్యులు పేర్కొన్నారు. తర్వాత హత్య చేసినట్టు ధ్రువీకరించారు. శ్రావణి ఒంటిపై గాయాలు ఉండటంతోపాటు ఛాతీ ఎముకలు విరిగినట్టు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారించారు.

స్కూల్ వద్ద విచారణ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రావణి పదో తరగతి స్పెషల్ క్లాసుల కోసమని వెళ్లి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్పెషల్ క్లాసులకు ఎవరెవరు వెళ్లారు, అక్కడ ఏం జరిగిందనే అంశంపై శ్రావణి చదివే స్కూల్ వద్ద విచారణ చేశారు.
ఆందోళన .. ఒకరి అరెస్ట్
మరోవైపు నిందితులపై చర్యలు తీసుకోవాలని శ్రావణి బంధువులు, గ్రామస్థులు బొమ్మలరామారంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించగా సీపీ మహేశ్ భగవత్ కలుగజేసుకొని .. 24 గంటల్లోపు నిందితులను గుర్తించి శిక్షిస్తామని హామీనివ్వడంతో వెనుదిరిగారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై వెంకటేశ్ ను సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications