ఒంటిపై పెట్రోలు పోసుకుని.. చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహాత్య
హైదరాబాద్ : శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న సాత్విక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోజు మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. హాస్టల్లోని రూమ్ నం.106లో సాత్విక ఈ బలవన్మరణానికి పాల్పడింది.

కాగా, ఎంపీసీ విద్యను అభ్యసిస్తోన్న సాత్విక స్వస్థలం ఆర్మూర్ మండలంలోని మచ్చెర్ల గ్రామం. ఆత్మహత్యకు గల కారణాలేవి తెలియరానప్పటికీ.. చదువులో తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేకపోవడం ఇందుకు ఓ కారణమై ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలిని పరిశీలించి కేసు మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తెలియవస్తున్న వివరాల ప్రకారం.. ఇంటికి దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేకనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే అభిప్రాయాలు సహ విద్యార్థినులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ర్యాంగింగ్ కోణంలోను విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోలు పోసుకుని సాత్విక ఆత్మహత్య చేసుకోవడంతో.. హాస్టల్ లోకి పెట్రోల్ ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతుండగా.. కాలేజీకి వచ్చే లెక్చరర్స్ బైక్స్ పార్కింగ్ చేసే స్థలం నుంచి సాత్విక పెట్రోల్ తీసుకొచ్చుకుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications