వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర కేసు: మంత్రికి భద్రత పెంపు; తెలంగాణా పోలీసులకు ఢిల్లీపోలీసుల షాక్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు సంబంధించిన వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ హత్యకేసులో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. హత్య కుట్ర చేశారని టీఆర్ఎస్, ఈ కుట్ర స్కెచ్ కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ లదని బీజేపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి ప్లాన్ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర: ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ల సినిమా అట్టర్ ఫ్లాప్: బండి సంజయ్శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర: ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ల సినిమా అట్టర్ ఫ్లాప్: బండి సంజయ్

 శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర కేసు.. 8 మంది అరెస్ట్, నేరం అంగీకారం

శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్ర కేసు.. 8 మంది అరెస్ట్, నేరం అంగీకారం

శ్రీనివాస్ గౌడ్ హత్యకు పదిహేను కోట్ల రూపాయల డీల్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేయడంతో పాటు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరైన రాఘవేంద్ర రాజు నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. తమ వ్యాపారాలతో పాటు ఆర్థికంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమను దెబ్బతీసిన కారణంగా హత్య చేయడానికి పథకం వేశామని రాఘవేంద్ర రాజు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

 తెలంగాణా పోలీసులకు ఢిల్లీ పోలీసులు షాక్

తెలంగాణా పోలీసులకు ఢిల్లీ పోలీసులు షాక్


ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో తెలంగాణ పోలీసులకు ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం, ఢిల్లీలో మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత అయిన జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో తాజాగా చోటు చేసుకున్న ట్విస్ట్ లో తెలంగాణ పోలీసులపై ఢిల్లీలో కేసు నమోదయింది. స్థానిక పోలీసుల అనుమతి లేకుండా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోకి వెళ్ళినందుకు కేసు నమోదు చేసినట్లు గా సమాచారం.

జితేందర్ రెడ్డి పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు

జితేందర్ రెడ్డి పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు

జితేందర్ రెడ్డి పిఏ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కొందరు అనుమానిత వ్యక్తులు జితేందర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి నలుగురు కిడ్నాప్ చేశారని ఎఫ్ఐఆర్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు తెలంగాణ డీజీపీ కి లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ పోలీసులు తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేశారని వెల్లడించారు. తెలంగాణ పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కేసు వ్యవహారాన్ని తాము అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. ఇదే సమయంలో జితేందర్ రెడ్డి పిఏకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ కోసం హైదరాబాద్ రావాలని వారు నోటీసులో పేర్కొన్నారు.

Recommended Video

Vijayawada నుండి Delhi కి పాదయాత్ర చేపట్టిన Srikakulam యువకుడు | Oneindia Telugu
హత్యకుట్ర నేపధ్యంలో శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంపు

హత్యకుట్ర నేపధ్యంలో శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంపు

ఇదిలా ఉంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంచాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం నిర్ణయించింది. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర బయటపడడంతో ఆయనకు భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు పైలెట్ వాహనాలు 20 మందితో భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఒక పైలెట్ సహా 10 మంది సెక్యూరిటీ ఉండేవారని తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత కల్పించనున్నారు.

English summary
Srinivas Goud murder conspiracy case the police Security beefed up for minister. Delhi police filed FIR and shocked Telangana police, on the trespass into Jitender reddy house without local police information
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X