ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలో మార్పు
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షలో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లీష్ పేపర్ -2 పరీక్షను ఏప్రిల్ 3 నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందున .. ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వచ్చే నెల 3వ తేదీకి మార్చారు. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

టైం టేబుల్ లో మార్పులేదు ..
ఇదివరకు విడుదల చేసిన టైం టేబుల్ లో ఎలాంటి మార్పులేదని పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సవరించిన పదో తరగతి పరీక్ష టైం టేబుల్
సవరించిన పదో తరగతి పరీక్ష టైం టేబుల్ పరీక్షల విభాగం విడుదల చేసింది. ఇందులో ఇంగ్లీష్ పేపర్ -2 పరీక్ష తేదీ మాత్రమే మారి ఉంటుందని .. మిగతా పరీక్షలు యాథావిథిగా ఉంటాయని తెలిపారు. ఆ టైంటేబుల్ ను ఒక్కసారి చుద్దాం.












Click it and Unblock the Notifications