ఇన్వర్టర్లు, కొవ్వొత్తులతో పాటు ఈ వస్తువులు స్టాక్ పెట్టుకోండి.. ఓటర్లకు కేటీఆర్ సూచన

తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించిన కేటీఆర్, కాంగ్రెస్ పాలన ఫెయిల్యూర్ పాలన అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా ఎటాక్ చేశారు.

ఈ వస్తువులను స్టాక్ పెట్టుకోండి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ ప్రభుత్వం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో కొన్ని ఉత్పత్తులను నిలువ చేసుకోవాలని అభ్యర్థించారు. తెలంగాణలో ఎన్నికలు ముగిస్తే వాటి అవసరం తప్పనిసరిగా ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల లాగా, తాను ఆరు వస్తువులు చెబుతున్నానని వాటిని స్టాక్ పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.

Stock these items along with inverters candles KTR advises voters

ఇవే కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు
అందులో 1. ఇన్వర్టర్ 2. చార్జింగ్ బల్బులు, 3. టార్చ్ లైట్లు, 4. కొవ్వొత్తులు, 5. జనరేటర్లు, 6. పవర్ బ్యాంకులు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్టాక్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. వీటినే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు గా హామీ ఇచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ప్రజలందరూ లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీని కూడా టార్గెట్ చేసిన కేటీఆర్ ప్రధాని మోడీ గారు చెప్పినట్టు అదాని, అంబానీలు కాంగ్రెస్ ( స్కాంగ్రెస్) కు టెంపోల నిండా డబ్బులు పంపిస్తుంటే ఆయన అభిమాన మిత్రులైన ఈ డి, ఐ టి, సి బి ఐ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.

జస్ట్ ఆస్కింగ్ మోడీ గారు అంటూనే చురకలు
ఇది డీమానిటైజేషన్ వైఫల్యం అని ఆయన ఇప్పటికైనా ఒప్పుకుంటారా .. జస్ట్ ఆస్కింగ్ మోడీజీ అంటూ పేర్కొన్నారు. ఓవైపు బీజేపీని. మరోవైపు కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన కేటీఆర్ ఈ ఎన్నికలలో ప్రజల నిర్ణయం తెలివైన నిర్ణయంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని ఆయన తన వ్యాఖ్యల ద్వారా తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+