ఇటు రాజ్‌భవన్.. అటు టీఎస్‌పీఎఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత: భారీ ఆందోళనలు
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. బీఆర్ఎస్ వీ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం ఉదయం భారీ సంఖ్యలో తరలివచ్చి రాజ్‌భవన్ ముందు బైఠాయించారు.
హైదరాబాద్: రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. బీఆర్ఎస్ వీ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం ఉదయం భారీ సంఖ్యలో తరలివచ్చి రాజ్‌భవన్ ముందు బైఠాయించారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరుపుతున్నారు. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు.
గవర్నర్ బిల్లు ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టి వివక్ష చూపుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బిల్లు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. రాజ్‌భవన్ లోపలికి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన
టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారానికి నిరసనగా పెద్ద ఎత్తున విద్యార్థులు, అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి పరీక్షలు రాస్తే.. ఈ లీకులు జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
TSPSC బోర్డ్ ఆఫీస్ మీద దాడి చేసిన బీజేవైఎం కార్యకర్తలు#TSPSC #tspscpaperleak pic.twitter.com/cz4ULPvFPm
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2023
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన పాత్ర లేకుండా పరీక్ష పేపర్ల లీకేజీ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే.. పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారని.. అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఇంజినీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే.. గ్రూప్ వన్, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళన క్రమంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు.












Click it and Unblock the Notifications