స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న మహేశ్ బాబు తనయుడు... తెలంగాణలో టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా...
సూపర్‌స్టార్ మహేశ్ బాబు-నమత్రా శిరోద్కర్‌ల తనయుడు గౌతమ్ స్విమ్మింగ్‌లో ప్రతిభ చాటుతున్నాడు. తన వయో గ్రూపులో తెలంగాణలోనే టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌లో అడుగుపెట్టిన గౌతమ్... రెండేళ్లలోనే అందులోని మెళకువలను అవపోసన పట్టాడు. స్విమ్మింగ్‌లోని బట్టర్‌ఫ్లై,బ్రెస్ట్ స్ట్రోక్,ఫ్రీస్టైల్,బ్యాక్‌స్ట్రోక్ విభాగాల్లో మంచి నైపుణ్యం సాధించాడు. ఈ విషయాలన్నీ గౌతమ్ తల్లి నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన నమత్రా... స్విమ్మింగ్‌లో తన కుమారుడు సత్తా చాటడం గర్వంగా ఉందన్నారు.'2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ ప్రారంభించిన గౌతమ్.. తెలంగాణలోని టాప్ 8 స్విమ్మర్లలో సులువుగా స్థానం సంపాదించాడని తెలిపారు. సహజసిద్ధంగానే గౌతమ్ అందులో మంచి ప్రావీణ్యం సంపాదించాడని... స్విమ్మింగ్‌లో కఠోర శ్రమను ఆస్వాదిస్తున్నాడని చెప్పారు. తగిన టెక్నిక్‌తో స్విమ్మింగ్‌లో కచ్చితత్వం సాధించాడని పేర్కొన్నారు.

స్విమ్మింగ్‌లో బట్టర్‌ఫ్లై,బ్యాక్‌స్ట్రోక్,బ్రెస్ట్‌స్ట్రోక్,ఫ్రీస్టైల్ విభాగాల్లో గౌతమ్ సునాయసంగా స్విమ్ చేయగలడని చెప్పారు. ఈ నాలుగింటిలో ఫ్రీస్టైల్ అతని ఫేవరెట్ అని... మూడు గంటల్లో 5కి.మీ ఈదగలడని చెప్పుకొచ్చారు.
సాధారణంగా సినీ హీరోల పిల్లలు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. వయసు,సందర్భం రాగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. కానీ మహేష్ తనయుడు సినిమాలపై కాకుండా స్విమ్మింగ్‌పై ఫోకస్ చేయడం విశేషం. గౌతమ్ టాలెంట్‌కు నమత్ర,మహేశ్‌లే కాదు... ఘట్టమనేని అభిమానులంతా సంబరపడిపోతున్నారు.
ప్రస్తుతం మహేశ్ బాబు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్‌తో షూటింగ్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశం ఉండటంతో త్వరలోనే షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
Recommended Video
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications