రేవంత్ రెడ్డి కేసులో అనుబంధ ఎఫ్ఐఆర్

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసులో సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించడానికి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సిద్ధమవుతోంది. ఏసీబీ కోర్టులో సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌ను అధికారులు సమర్పించబోతున్నట్లు సమాచారం

ఓటుకు నోటు కేసులో నాలుగు రోజుల పాటు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని ఎసిబి అధికారులు విచారించారు. ఆ విచారణ ఆధారంగా మరికొందరు పేర్లను చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి సమన్లు తీసుకుని చట్టపరమైన చర్యలకు వెళ్లాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.

Supplementary FIR in Revanth Reddy's cash for vote case

కాగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు రేవంత్‌ రెడ్డి కస్టడీ గడువు ముగియనుంది. అనంతరం రేవంత్‌, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. రేవంత్‌రెడ్డిని మరింత విచారించాల్సిన అవసరం ఉందని మరో రెండు రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టును కోరనున్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం నుంచి ఓటుకు కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు ఇళ్లలోనూ ఏసీబీ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు, కీలకమైన హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న అధికారులు రేవంత్‌రెడ్డి పాస్‌పోర్టును సీజ్‌ చేశారు. అలాగే రేవంత్‌ బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+