ఏపీ విభజన చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ: జాప్యమెందుకని తెలంగాణకు ప్రశ్న
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో జాప్యంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరోవైపు విభజనకు సంబందించి కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లను ఏపీ తరఫు న్యాయవాది తప్పుబట్టారు.

కేంద్రం అఫిడవిట్లపై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు కోసం.. కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 4 వారాల గడువు ఇచ్చింది.












Click it and Unblock the Notifications