మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ... ఆయనకే ఛాన్స్? ప్రకటన జాప్యానికి కారణం ఇదే!!

మునుగోడు ఉపఎన్నిక రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి. త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని శుక్రవారం ప్రకటించడం, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖాయమని తేలడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించడంపై అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరికి అభ్యర్థిగా అవకాశం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.

అభ్యర్థి విషయంలో సామాజిక వర్గాల ఓటర్ల ప్రభావంపై కసరత్తు

అభ్యర్థి విషయంలో సామాజిక వర్గాల ఓటర్ల ప్రభావంపై కసరత్తు


కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలా లేక బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలా అనే అంశంపై కసరత్తు చేస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో మెజారిటీ వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించడం కోసం అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది.

అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రెడ్డి, బీసీ సామాజిక వర్గాల నేతలు

అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రెడ్డి, బీసీ సామాజిక వర్గాల నేతలు

రెడ్డి, బీసీ సంఘాల నేతల మధ్య అభ్యర్థి విషయంలో చోటుచేసుకున్న వాగ్వాదం కారణంగా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో ఉంచాల్సి వచ్చిందని సమాచారం. ఇప్పటికే బిజెపి ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చి దూకుడుగా ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో ప్రధాన పోటీదారులు రంగంలోకి దిగడంతో త్వరలో టీఆర్‌ఎస్‌ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కూసుకుంట్ల కోసం లాబీయింగ్ చేస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

కూసుకుంట్ల కోసం లాబీయింగ్ చేస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

2014లో గెలిచి 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌గా ఉన్న ఇంధన శాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి ప్రభాకర్‌కు మద్దతుగా ఉన్నారు. రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయడం కోసం ఆయనకు టికెట్ దక్కేలా లాబీయింగ్ చేస్తున్నారు. జగదీష్ రెడ్డి తన ఎన్నికల సభలన్నింటిలో ప్రభాకర్ రెడ్డి మాత్రమే తన వెంట ఉండేలా చూసుకుంటూ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా తానే అని పార్టీ శ్రేణులతో పాటు ఓటర్లకు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరుతున్న నాయకులు

బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరుతున్న నాయకులు

మునుగోడు ఓటర్లలో నమ్మకం కోల్పోవడం వల్లే 2018 ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారని, మళ్లీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయని నల్గొండ జిల్లా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకులు ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలకు టిక్కెట్టు కోరుతున్న ప్రముఖ బీసీ సంఘం నాయకులలో భోంగిర్ మాజీ లోక్‌సభ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ మరియు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఉన్నారు.

టికెట్ ఏ సామాజిక వర్గ నాయకుడికి ఇస్తారో ? టీఆర్ఎస్ లోనూ ఉత్కంఠ

టికెట్ ఏ సామాజిక వర్గ నాయకుడికి ఇస్తారో ? టీఆర్ఎస్ లోనూ ఉత్కంఠ

ఈ ఉప ఎన్నికను రెడ్డి, బీసీ సామాజికవర్గ అభ్యర్థుల మధ్య పోరుగా మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తోందా లేక రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి, ఒకే సామాజిక వర్గం లోని నేతల మధ్య పోరుగా మార్చాలని ప్రయత్నం చేస్తుందా అన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా ముఖ్యంగా వారు ఓటర్లను ప్రభావితం చెయ్యగలిగేవారు అయ్యుండాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+