గుడ్ ఐడియా: మోడీకి కాంగ్రెస్ నేత కరణ్ ప్రశంస, విధుల మాటేమిటి?

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతున్న కాంగ్రెస్ నాయకుల జాబితాలో మరొకరు చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ డాక్టర్ కరణ్ సింగ్ ఆదివారం నాడు ప్రధాని మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు కితాబిచ్చారు. అది మంచి ఆలోచన అన్నారు.

బిట్స్ హైదరాబాద్ నాలుగో స్నాతకోత్సవంలో కరణ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రాథమిక హక్కుల గురించి పోరాడటంలో తప్పు లేదని, ప్రాథమిక విధుల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రాథమిక విధులున్నాయని కూడా మనలో చాలామందికి తెలియదన్నారు.

 Swachh Bharat a good idea, says Karan Singh

ఇప్పటికైనా మేల్కొని అవి ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఆ పదింటిని తరగతి గదిలో రాసి నేటి తరానికి అవగాహ కల్పించాల్సిన బాధ్యత ప్రతి విద్యా సంస్థ పైన ఉందన్నారు. కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావడం సహజమని చెప్పారు.

నిజమైన విద్య అంటే అణుబాంబులు తయారు చేయడం కాదన్నారు. మనలను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమని చెప్పారు. ఎప్పుడో రూపొందించిన సిలబస్‌ను ఇప్పుడు చదువుకోవాల్సిన దుస్థఇతి ఏర్పడిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+