సౌత్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ : స్వాగత్ వంటకాలకు 'వహ్వా' చెప్పాల్సిందే (పిక్చర్స్)
హైదరాబాద్ : నోరూరించే వంటకాలన్నీ ఒకే చోట దర్శనమిస్తే.. ఎవరికి మాత్రం మనసాగుతుంది. పసందైన రుచులతో జిహ్వకు పండుగే. నగరంలో ఫుడ్ కల్చర్ పెరిగిపోయిన తర్వాత చాలా హోటల్స్ రక రకాల ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది హోటల్ స్వాగత్.
సౌత్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ పేరిట పసందైన వంటకాలను అందించడానికి రెడీ అయిన స్వాగత్.. మే 13 నుంచి 22 వరకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది. మదీనాగూడలో ఉన్న స్వాగత్ హోటల్ లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపింది సంస్థ యాజమాన్యం.

ఫోటోల్లో షెఫ్ఫులు
ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా క్లిక్ మనిపించిన ఫోటోల్లో ముసి ముసి నవ్వులతో స్వాగత్ హోటల్ షెఫ్స్..

వంటల్లో కింగులు
పులుసు భోజనం తింటే జీవితం పునీతమవాల్సిందే. అందునా.. చేపల పులుసు నోటికంటిందంటే.. అదరహో అననివారెవ్వరు. ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా స్వాగత్ అందిస్తున్న వంటల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా చేపల పులుసు

నవ్వుతూ ఇచ్చారు పోజులు
వంటలన్నీ వరుసల్లో పేర్చి.. సాంప్రదాయతను కూడా అద్దినట్టు, ఫుడ్ ఫెస్టివల్ లో సాంప్రదాయ దుస్తుల్లో వడ్డిస్తున్న స్వాగత్ సిబ్బంధి

వండితే చెప్పాల్సిందే వహ్వాలు..
కోడికూరంటే నోరూరంటే వ్యక్తులుంటారా..! మంచి మసాలా దట్టించి వండితే, వద్దనకుండా కుంభాలు కుంభాలు లాగించేయొచ్చు. స్వాగత్ ఫుడ్ ఫెస్టివల్ లో 'కోడికూర' వంటకం ఫోటో.












Click it and Unblock the Notifications