అసెంబ్లీ తొలినాడే టీ షర్టులతో రచ్చ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్, ఉద్రిక్తత!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే బిఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టి నిరసన తెలియజేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో అసెంబ్లీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేడు అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పైన అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

ఆ టీ షర్టులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అంతేకాదు సభలో ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టడానికి కూడా రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే ఇదే సమయంలో సభలో అధికార పార్టీని నిలదీయడానికి అనేక అంశాలతో వ్యూహం సిద్ధం చేసుకున్న బి ఆర్ ఎస్ నేతలు అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ రాసి ఉన్న టీషర్ట్ ను ధరించి నేడు అసెంబ్లీకి వచ్చారు.

T-shirt riot at the Assembly BRS MLAs arrested tension

అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం..
అయితే అసెంబ్లీ గేటు బయట పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధరించిన టీ షర్టుల పైన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ టీషర్ట్ లు ధరించి లోనికి వెళ్లకూడదని వారు పేర్కొన్నారు దీంతో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము అలానే అసెంబ్లీకి వెళ్తామని పట్టుబట్టారు. టీ షర్టులతో ఎందుకు అసెంబ్లీకి వెళ్ళకూడదో చెప్పాలని వారు వాదించారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అదానీ అంశంతో సభలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే లోనికి వెళ్తామని పట్టుపట్టారు. ఇక రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదని అందుకే మాకు టీషర్ట్స్ ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారు అంటూ కేటీఆర్ సైతం చురకలాంటించారు.

తెలంగాణా తల్లి విగ్రహంపైనా ఆందోళన.. అరెస్ట్, ఉద్రిక్తత
తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు చేశారు . తెలంగాణా తల్లి చేతిలో ఉన్న బతుకమ్మ తీసి తెలంగాణ తల్లి విగ్రహంలో చెయ్యి గుర్తు పెట్టారని మండిపడ్డారు. కొద్దిసేపు అక్కడే బైఠాయించి ఆందోళన తెలియజేశారు. దీంతో పోలీసులు ఎంత చెప్పినా వినని బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకొని అరెస్టు చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+