హైదరాబాద్ తాజ్ బంజారా లాక్..
Taj Banjara Hotel: తాజ్ బంజారా.. హైదరాబాద్‌లో ఉన్న టాప్ ఫైవ్ స్టార్ హోటళ్లల్లో ఇదీ ఒకటి. సెలెబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుంటారు దీన్ని. టాలీవుడ్ సెలెబ్రిటీలకు టాప్ ఛాయిస్ ఇదే. బంజారాహిల్స్‌లో ఉండే ఈ లగ్జూరియస్ ఫైవ్ స్టార్ హోటల్‌కు తాళం పడింది.
ఆ హోటల్ యాజమాన్యానికి బిగ్ షాక్ ఇచ్చారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. హోటల్ మొత్తాన్నీ సీజ్ చేసిపడేశారు. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు సంవత్సరాలుగా తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం పన్నులు చెల్లించకపోవడమే దీనికి కారణం.

ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ హోటల్ యాజమాన్యం చెల్లించాల్సిన పన్నుల బకాయిలు 1.4 కోట్ల రూపాయలుగా తేలింది. ఎప్పటికప్పుడు చెల్లింపులను ఎగవేస్తూ వచ్చిందనేది ప్రధాన ఆరోపణ. సకాలంలో పన్నులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు.
ఈ రెండు సంవత్సకాల కాలంలో హోటల్ యాజమాన్యం 1.4 కోట్ల రూపాయల మేర పన్నులు బకాయిలు పెట్టిందని తెలుస్తోంది. ఏడాదిన్నర కిందటే దీన్ని డీఫాల్టర్‌ల జాబితాలోనూ చేర్చారు. ఆ తరువాత కూడా నోటీసులు పంపించనప్పటికీ పట్టంచుకోకపోవడం వల్ల తాజాగా కొరడా ఝుళిపించారు. తాళం వేశారు. దీన్ని సీజ్ చేశారు.
దాదాపుగా రెండేళ్ల నుంచీ తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం పన్నులను చెల్లించాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ- వాటిని పట్టించుకోలేదని అంటున్నారు. ఫలితంగా సీజ్ చేయక తప్పలేదని తేల్చి చెప్పారు.
మొత్తం 9,800 కోట్ల రూపాయల మేర పన్నుల బకాయిలు జీహెచ్ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో 19.58 లక్షల మంది పన్ను చెల్లింపుదారులలో 13 లక్షల మంది మాత్రమే తమ ఆస్తి పన్నులను చెల్లిస్తోన్నారని అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో 1,900 కోట్ల రూపాయల మేర పన్నులు వసూలు అయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయల మేర పన్నులను రాబట్టుకోవాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకుననారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1,450 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయని అంటున్నారు. తాజ్ బంజారా వంటి హై ప్రొఫైల్ డిఫాల్టర్లను లక్ష్యంగా చేసుకుని పన్ను వసూలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications