మహారాష్ట్రలో పర్యటించిన తెలంగాణ మంత్రులు: ‘అచ్ఛద్’ పరిశీలన(పిక్చర్స్)
హైదరాబాద్/ముంబై: తెలంగాణ రాష్ట్రంలో చెక్‌పోస్టుల ఆధునీకరణకు అవలంభించాల్సిన విధానంపై అధ్యయనం చేయడానికి వాణిజ్య, పన్నులశాఖ నేతృత్వంలో రాష్ట్రం నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం సోమవారం మహారాష్ట్రలో పర్యటించింది. పొరుగు రాష్ర్టాల నుంచి సరుకుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్రంలోని చెక్‌పోస్టులను ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంత్రుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా, వాణిజ్య, పన్నులశాఖ కమిషనర్ అనీల్‌కుమార్ తదితరులు మహారాష్ట్రలోని ‘అచ్ఛద్' వద్దనున్న మల్టీలెవెల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును పరిశీలించారు.

మంత్రుల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో చెక్‌పోస్టుల ఆధునీకరణకు అవలంభించాల్సిన విధానంపై అధ్యయనం చేయడానికి వాణిజ్య, పన్నులశాఖ నేతృత్వంలో రాష్ట్రం నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం సోమవారం మహారాష్ట్రలో పర్యటించింది.

మంత్రుల పరిశీలన
పొరుగు రాష్ర్టాల నుంచి సరుకుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్రంలోని చెక్‌పోస్టులను ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మంత్రుల పరిశీలన
వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా, వాణిజ్య, పన్నులశాఖ కమిషనర్ అనీల్‌కుమార్ తదితరులు మహారాష్ట్రలోని ‘అచ్ఛద్' వద్దనున్న మల్టీలెవెల్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును పరిశీలించారు.

మంత్రుల పరిశీలన
దాదాపు 60 ఎకరాల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.100 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు.

మంత్రుల పరిశీలన
మహారాష్ట్రలో మొత్తం 23 తనిఖీ కేంద్రాలు ఉండగా సమీకృత తనిఖీ కేంద్రాలు 10 ఉన్నాయి. సమీకృత తనిఖీ కేంద్రాల్లో అమ్మకం పన్నుతోపాటు ఎక్సైజ్, రవాణ పన్నులనూ వసూలు చేస్తున్నారు. పలు సంస్థలకు గోదాములూ ఇక్కడే ఉన్నాయి.
దాదాపు 60 ఎకరాల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.100 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో మొత్తం 23 తనిఖీ కేంద్రాలు ఉండగా సమీకృత తనిఖీ కేంద్రాలు 10 ఉన్నాయి. సమీకృత తనిఖీ కేంద్రాల్లో అమ్మకం పన్నుతోపాటు ఎక్సైజ్, రవాణ పన్నులనూ వసూలు చేస్తున్నారు.
పలు సంస్థలకు గోదాములూ ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి బహుళ ప్రయోజన సమీకృత తనిఖీ కేంద్రాలను తెలంగాణలోనూ ఏర్పాటు చేయటం కోసమే మహారాష్ట్ర పర్యటన చేపట్టినట్టు మంత్రి శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. ఇటువంటి తనిఖీ కేంద్రాలు ఏర్పాటైనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే సరుకులపై పూర్తి నిఘా ఉంచి పన్నులను రాబట్టేందుకు వీలవుతుందన్నారు.












Click it and Unblock the Notifications