రేవంత్‌కు ఝలక్: ఎమ్మెల్యేగానే ఉండాలంటూ ఎస్ఎంఎస్ పంపిన రమణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ఉదయం టిడిపి తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో చంద్రబాబునాయుడుతో టిడిపి తెలంగాణ నేతల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శాసనసభపక్షనేతగా సమావేశాలు నిర్వహించకూడదని ఎల్. రమణ గురువారం నాడు రేవంత్‌రెడ్డికి ఎస్ఎంఎస్ పంపారు.

  టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకుని, కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్ | Oneindia Telugu

  ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

  రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎల్. రమణ మరోసారి రేవంత్‌రెడ్డి మేసేజ్ పెట్టడం టిడిపిలో నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది.

  చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

  అక్టోబర్ 27వ, తేది నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం నాడు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశానికి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హజరయ్యారు.

  రేవంత్‌కు షాక్: 'టిడిఎల్పీ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశం'

  ఈ సమావేశానికి టిడిఎల్పీ హోదాలో రేవంత్‌రెడ్డి హజరుకావాలి. కానీ, పార్టీ ఆదేశం మేరకు రేవంత్‌కు బదులుగా సండ్ర వెంకటవీరయ్య ఈ సమావేశానికి హజరయ్యారు.

  తెలంగాణ నేతలతో బాబు సమావేశం

  తెలంగాణ నేతలతో బాబు సమావేశం

  విదేశీ పర్యటన ముగించుకొని టిడిపి జాతీయ అథ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైద్రాబాద్‌కు చేరుకొంటారు. శుక్రవారం ఉదయమే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. మరో వైపు రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో పార్టీ నేతలు బాబుకు పరిస్థితిని వివరించనున్నారు. అయితే అదే సమయంలో తన వాదనను రేవంత్‌రెడ్డి కూడ చంద్రబాబుకు వివరించే అవకాశం లేకపోలేదు.అక్టోబర్ 27వ, తేదిన తెలంగాణ టిడిపి నేతలతో బాబు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

   టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టిడిఎల్పీ నేతగా

  టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టిడిఎల్పీ నేతగా

  వ్యవహరించకూడదని రేవంత్‌రెడ్డికి టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ పేరుతో రేవంత్‌రెడ్డి సెల్‌ఫోన్‌కు గురువారం నాడు ఉదయం ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయమై బుదవారం నాడే ఎల్. రమణ బహిరంగంగానే ప్రకటన చేశారు. అంతేకాదు పార్టీ పదవుల నుండి రేవంత్‌ను తొలగించాలంటూ రమణ్ చంద్రబాబునాయుడుకు లేఖ కూడ రాశారు. టిడిఎల్పీ సమావేశం కూడ నిర్వహించకూడదని రమణ..రేవంత్‌రెడ్డిని ఆదేశించారు. ఈ పరిణామాల తర్వాత రేవంత్‌రెడ్డికి గురువారం నాడు రమణ మరోసారి ఎస్ఎంఎస్ పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

  బిఎసి సమావేశానికి టిడిపి తరపున సండ్రవెంకటవీరయ్య

  బిఎసి సమావేశానికి టిడిపి తరపున సండ్రవెంకటవీరయ్య

  డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు మధ్యాహ్నం అసెంబ్లీలో బిఎసి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డి హజరుకాలేదు. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టిడిపి తరపున హజరయ్యారు.

  రేవంత్‌తో ఎవరూ కూడ వెళ్ళడం లేదు

  రేవంత్‌తో ఎవరూ కూడ వెళ్ళడం లేదు

  రేవంత్‌తో పాటు ఎవరూ కూడ టిడిపి నేతలు వెళ్ళడం లేదని టిడిపి నేత అరవింద్‌కుమార్‌గౌడ్ చెప్పారు.రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని టిడిపి నేత అరవింద్‌కుమార్‌గౌడ్ విమర్శలు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tdp chief Chandrababu naidu will meeting with Telangana leaders on Frinday morning at Hyderabad.Tdp Telangana president Ramana already informed to Chandrababunaidu on Revanth reddy episode.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి