వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌రెడ్డి పైకి టి-టిడిపి 'ఓటుకు నోటు' అస్త్రం, బాబుపై కడియం సంచలన వ్యాఖ్య

టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ టిడిపి నేతలు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ టిడిపి నేతలు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

చదవండి: కాంగ్రెస్ ముందు రేవంత్ రెడ్డి 'కీలక' ప్రతిపాదనలు, దూకుడుకు చంద్రబాబు అడ్డుకట్ట

రేవంత్ రెడ్డి వల్లే అంతా

రేవంత్ రెడ్డి వల్లే అంతా

తెలంగాణ టిడిపి నేత అరవింద్ కుమార్ గౌడ్.. రేవంత్ పైన తీవ్ర ఆగ్రహం చేశారు. ఆయన చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో పార్టీ ఇలా మారిందన్నారు. పార్టీ మారే విషయమై ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు ప్రభావం

ఓటుకు నోటు ప్రభావం

తెలంగాణలో టిడిపి ఎక్కువగా మసకబారడానికి ఓటుకు నోటు కారణమనే విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వబోయి రేవంత్ దొరికిపోయారు. ఈ కేసు నడుస్తోంది. అప్పటి నుంచే తెలంగాణలో టిడిపి పరిస్థితి తారుమారయింది. 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ తర్వాత తెరాసలోకి క్యూ కట్టారు.

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu
కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు

కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా మాట్లాడారు. తెలంగాణలో టిడిపి ఉందో లేదో ఆ పార్టీ నేతలకే తెలియదని ఎద్దేవా చేశారు. పార్టీ లేదనే కొందరు టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

చంద్రబాబు వద్ద ఆత్మగౌరవం తాకట్టుపెట్టలేక

చంద్రబాబు వద్ద ఆత్మగౌరవం తాకట్టుపెట్టలేక

తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వద్ద ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేక తెరాసలో చేరానని చెప్పారు. అప్పుడు తెలంగాణ వస్తుందో రాదో తెలియకుండా ఉందని చెప్పారు. అరవై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన చర్య

రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన చర్య

అలాంటి పార్టీలోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. రేవంత్ ఆత్మగౌరవం లేని వ్యక్తి అని, అందుకే ఇప్పుడు టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.

English summary
Telugu Desam Party leader Arvind Kumar Goud on Wednesday fired at Telangana TDP working president Revanth Reddy for joining Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X