కాంగ్రెస్ ముందు రేవంత్ రెడ్డి 'కీలక' ప్రతిపాదనలు, దూకుడుకు చంద్రబాబు అడ్డుకట్ట
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో మంగళవారం భేటీ అయినట్లుగా ప్రచారం జరిగింది.
న్యూఢిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో మంగళవారం భేటీ అయినట్లుగా ప్రచారం జరిగింది.
ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పెద్దలకు పలు హామీలు ఇచ్చారని తెలుస్తోంది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం, ఇతర కీలక నేతలను తీసుకు వస్తానని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం.
Recommended Video


రేవంత్ రెడ్డికి ఈ రెండింట్లో ఏదో ఓ పదవి
రేవంత్ రెడ్డి చేరికపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏవైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప చేరిక మాత్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పెద్దలతో భేటీ సమయంలో తనకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి లేదా ఎన్నికల ప్రచార సంఘం బాధ్యతలు అప్పగించాలని, తాను పలువురు కీలక నేతలను పార్టీలోకి తీసుకు వస్తానని చెప్పారని సమాచారం.

ఫిర్యాదులు, చర్చిస్తున్న అధిష్టానం
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూడటం వెనుక ఆ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చక్రం తిప్పినట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో పలువురు ముఖ్య నేతలు అధిష్టానానికి రేవంత్‌ను చేర్చుకోవద్దని కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో మచ్చపడ్డ రేవంత్ రెడ్డిని చేర్చుకోవడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదని మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం ఇంకా చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి పైన పలువురు టిటిడిపి నేతల అసంతృప్తి
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారని జరుగుతున్న ప్రచారం టిడిపిలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ టిడిపిలో తాజా పరిణామాల కారణంగానే ఆయన పార్టీని వీడి వెళ్తారన్న ప్రచారం అధికమైంది. ప్రభుత్వ విధానాలపై పార్టీ పేరుతో కొన్ని కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఏకపక్షంగా చేపడుతున్నారని, అందర్నీ కలుపుకొని వెళ్లడంలేదని నేతలు చెబుతున్నారు.

రేవంత్ దూకుడుకు చంద్రబాబు బ్రేకులు
పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ నేతలతో సమీక్షించినప్పుడల్లా అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని పదేపదే చెప్పడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. తద్వారా రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.

రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
ఇక, వచ్చే శాసనసభ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని కొందరు నేతలు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదని, అవసరమైతే టిఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. ఇలా పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై రేవంత్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారని అంటున్నారు. ఇటీవల కేసీఆర్‌ను పయ్యావుల కలవడం కూడా తెలంగాణ టిడిపిలో చర్చకు దారి తీసింది.
-
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications