'టీఆర్ఎస్ నేతలంతా ఏడాది బిడ్డలు, ఇతర పార్టీల్లో పదవులు అనుభవించలేదు'

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఏడాది బిడ్డ అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. నల్గొండ జిల్లా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలో నిరుద్యోగ గర్జన నిర్వహించారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ 'నిజమే, టీఆర్ఎస్ నేతలంతా ఏడాది బిడ్డలు, దశాబ్దాలుగా ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన నేటి టీఆర్ఎస్ నేతలు పసిగుడ్డులే అంటూ వెటకారంగా మాట్లాడారు. 'వీరంతా ముదురు బేబీస్' అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఖాలీగా ఉన్న 2 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ వేసే ప్రసక్తే లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు ఓట్లకోసమే విద్యార్ధి, యువతను వాడుకున్నారని ఆయన ఆరోపించారు.

Tdp Mla R Krishnaiah fires trs leaders

ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరితే కమలనాథన్ కమిటీ సిఫార్సులు పూర్తయితే తప్ప ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పడం సరైంది కాదని అన్నారు. నిరుద్యోగులను మోసం చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాలను భర్తీ చేయకపోతే గ్రామాల్లో పర్యటనలు చేయకుండా చేస్తామని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యులకు, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఈయాడా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+