'రేవంత్ థ్యాంక్స్ చెప్పేందుకెళ్లారు, చంపేందుకు కుట్ర'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తనకు అసంతృప్తి ఉందని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ చెప్పారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు స్టీఫెన్ స్వయంగా సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.
టీడీపీ అభ్యర్థికి ఓటేసేందుకు స్టీఫెన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పేందుకే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వెళ్లారని చెప్పారు. స్టీఫెన్‌తో మాట్లాడుతుంటే ఏదో నేరం చేసినట్లుగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడందారుణమన్నారు.

రేవంత్ రెడ్డిని చంపడానికి కుట్రపన్నుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. తమకు బలం లేదని తెలిసినా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఐదో అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబెట్టారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలన్నారు.
రేవంత్ రెడ్డికి పరామర్శలు
లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనను చుట్టుముట్టి పరామర్శించారు. కొందరు ఆలింగనం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తోంది. మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెస్ తెరాసకు మద్దతిస్తున్నాయి.












Click it and Unblock the Notifications